spot_img
Homeక్రీడలుక్రికెట్‌Afghanistan Vs New Zealand: ఆఫ్ఘనిస్తాన్ మౌనం ఇంతటి ప్రమాదకరం.. న్యూజిలాండ్ కు అర్థమయ్యేలోగా విధ్వంసం..

Afghanistan Vs New Zealand: ఆఫ్ఘనిస్తాన్ మౌనం ఇంతటి ప్రమాదకరం.. న్యూజిలాండ్ కు అర్థమయ్యేలోగా విధ్వంసం..

Afghanistan Vs New Zealand: ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు t20 వరల్డ్ కప్ లో ఆడేందుకు భారత గడ్డమీద అడుగు పెట్టారు. తీవ్రంగా సాధన చేశారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ తీవ్రంగా తన జట్టు ప్లేయర్లతో సమాలోచనలు జరిపాడు. ఆటగాళ్లకు నిత్యం ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు.

రషీద్ ఖాన్ ప్రణాళికలను.. అతడు వేస్తున్న అడుగులను కొంతమంది మాజీ క్రికెటర్లు పరిశీలించారు. ఆ దిశగానే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “రషీద్ ఖాన్ మామూలు ఆటగాడు కాదు . ఆఫ్ఘనిస్తాన్ సారధి కూడా. అతనిలో అన్ని కోణాలు ఉన్నాయి. చివరికి శిక్షకుడిగా కూడా అతడు తన పాత్రను పోషిస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఈసారి గట్టిగా ఏదో ప్లాన్ చేసేలా ఉన్నాడని” మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

వారు అభిప్రాయపడినట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ లో ఆదివారం సంచలనం సృష్టించింది. ఆఫ్గనిస్తాన్ జట్టు ప్లేయర్లలో గుల్బదిన్ నైట్ (63) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. అటల్(29), గుర్బాజ్(27) సత్తా చూపించడంతో ఆఫ్గనిస్తాన్ జట్టు 182 పరుగులు చేసింది. తద్వారా న్యూజిలాండ్ జట్టు ఎదుట 183 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

ఈ టార్గెట్ న్యూజిలాండ్ జట్టు 17.5 ఓవర్లలో ఫినిష్ చేసింది. న్యూజిలాండ్ జట్టులో టీం సీ ఫర్ట్ 65 పరుగులు చేశాడు. ఫిలిప్స్ 42 పరుగులు చేశాడు. మార్క్ చాంప్మన్ 28, మిచల్ 25 పరుగులు చేశారు. ఫలితంగా న్యూజిలాండ్ జట్టు మరో 2.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో పోల్చితే న్యూజిలాండ్ బలమైనది. అంతటి బలమైన జట్టు బౌలింగ్ ను సైతం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు సులభంగా తీసుకున్నారు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి పరుగులు సాధించారు.

న్యూజిలాండ్ జట్టు ఇటీవల భారత దేశంలో పర్యటించింది. ఐదు టి 20 మ్యాచ్లు ఆడింది. ఇందులో టీమ్ ఇండియా నాలుగు మ్యాచ్లో గెలిచింది. కొంతకాలంగా ఇండియాలోనే ఉంటున్న న్యూజిలాండ్ ప్లేయర్లకు ఇక్కడి మైదానాలు అలవాటు పడినట్టుగా అనిపించడం లేదు. సమర్థవంతమైన బౌలర్లు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ధారాళంగా పరుగులు ఇచ్చింది. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీగా స్కోర్ చేయగలిగింది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ లో కూడా ఇదే స్థాయిలో సత్తా చూపిస్తే.. టి20 వరల్డ్ కప్ లో పెను సంచలనం నమోదు అవుతుంది. 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన ప్రదర్శన చేసింది. ఏకంగా సెమి ఫైనల్ దాకా దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా మీద భారీ స్కోర్ చేయగలిగింది. అయితే బౌలింగ్లో సత్తా చూపించలేకపోవడంతో ఓటమిపాలైంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper