Homeక్రీడలుక్రికెట్‌T20 World Cup Travel Restrictions 2026: సూపర్ 8 లో ఓడిపోయినప్పటికీ.. ఇండియాలోనే జింబాబ్వే,...

T20 World Cup Travel Restrictions 2026: సూపర్ 8 లో ఓడిపోయినప్పటికీ.. ఇండియాలోనే జింబాబ్వే, విండీస్ ప్లేయర్లు.. కారణమేంటంటే?

T20 World Cup Travel Restrictions 2026: టి20 వరల్డ్ కప్ లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు అద్భుతమైన ప్రతిభ చూపించాయి. ఫలితంగా సూపర్ 8 దశ వరకు వచ్చాయి. ఇందులో జింబాబ్వే జట్టు, వెస్టిండీస్ జట్టు ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్ల ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉన్నారు. సూపర్ 8 లో ఓడిపోయినప్పటికీ జింబాబ్వే, వెస్టిండీస్ ప్లేయర్లు ఇండియాలో ఉండడానికి ప్రధాన కారణం.. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూ ఉండడమే. […]

T20 World Cup Travel Restrictions 2026: టి20 వరల్డ్ కప్ లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు అద్భుతమైన ప్రతిభ చూపించాయి. ఫలితంగా సూపర్ 8 దశ వరకు వచ్చాయి. ఇందులో జింబాబ్వే జట్టు, వెస్టిండీస్ జట్టు ఓడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్ల ఆటగాళ్లు ఇంకా ఇండియాలోనే ఉన్నారు.

సూపర్ 8 లో ఓడిపోయినప్పటికీ జింబాబ్వే, వెస్టిండీస్ ప్లేయర్లు ఇండియాలో ఉండడానికి ప్రధాన కారణం.. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూ ఉండడమే. గల్ఫ్ ప్రాంతాలలో విపరీతమైన భద్రతా ఆంక్షలు ఉన్నాయి. దీంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనికి తోడు దుబాయ్ మార్గం ద్వారా ప్రయాణం సాగించడం అసలు వీలు కావడం లేదు . ఈ నేపథ్యంలో వెస్టిండీస్ ప్లేయర్లను త్వరగా వారి సొంత దేశానికి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. వెస్టిండీస్ ప్లేయర్లను స్వదేశం పంపించడానికి అటు ఐసిసి.. ఇటు బిసిసిఐ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

వెస్టిండీస్ జట్టు మాత్రమే కాదు.. జింబాబ్వే జట్టుకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సూపర్ 8 లో నుంచి బయటికి వచ్చిన ఆ జట్టు ప్లేయర్లు కూడా విమానాల నిలిపివేత వల్ల.. మనదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. జింబాబ్వే ప్లేయర్లను కూడా వారి సొంత దేశానికి పంపించడానికి ఐసీసీ, బీసీసీఐ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్ ప్లేయర్లు ఇండియాలోనే ఉండిపోయారు.

ఇక ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ సెమి ఫైనల్ దశకు చేరుకుంది. గ్రూప్ వన్ నుంచి భారత్, సౌత్ ఆఫ్రికా సెమి ఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీఫైనల్ లో తలపడేందుకు అర్హత సాధించాయి. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. సెమి ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల సాగకపోతే రిజర్వ్ డే ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper