Sunrisers Hyderabad: తొలి మ్యాచ్లో రాజస్థాన్ జట్టుతో పోటీపడి హైదరాబాద్ ఏకంగా 286 పరుగులు చేసింది. దీంతో ఈసారి 300 స్కోర్ పక్కా అనే ముందస్తు అంచనాలు మొదలయ్యాయి. ఇక అప్పుడు మొదలైంది హైదరాబాద్ జట్టుకు బ్యాడ్ టైం. ఒక మ్యాచ్ వెంట మరొక మ్యాచ్ ఓడిపోతూ.. హైదరాబాద్ జట్టు పరువు తీసుకుంటుంది.. లక్నో, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్.. ఇలా వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొంది హైదరాబాద్.. ఫలితంగా హైదరాబాద్ జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. బ్యాటింగ్లో విఫలం కావడం.. బౌలింగ్లో నిర్లక్ష్యాన్ని చూపించడం.. ఫీల్డింగ్లో బద్ధకాన్ని ప్రదర్శించడంతో హైదరాబాద్ జట్టు ఏమాత్రం సత్తా చూపించలేకపోతోంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లపై విమర్శలు పెరిగిపోయాయి. యాజమాన్యంపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి దశలో తదుపరి మ్యాచ్లలో హైదరాబాద్ జట్టు కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఈసారి గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాల్సి ఉంటుంది.
Also Read: అక్షర్ బ్రో.. నీది బుర్రా.. పాదరసమా.. RCB ని నేల నాకించావ్ కదా!
ఎయిర్ ఆసియాతో..
హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు వివిధ స్టేడియాలకు వెళ్లడానికి విమానాలలోనే ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్ ఆటగాళ్లు మాత్రమే కాదు, మిగతా జట్ల ఆటగాళ్లు కూడా విమానాలలోనే ఇతర స్టేడియాలకు వెళుతుంటారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు వివిధ స్టేడియాలకు ప్రయాణించేందుకు సరికొత్త విమానాన్ని రూపొందించింది. ఈ విమానాన్ని ఎయిర్ ఆసియా నడుపుతోంది. ఇందులో భాగంగానే విమానాన్ని సన్ రైజర్స్ లోగో ఉండే విధంగా కష్టమైజ్ చేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంది. ఇక ఈ వీడియోను హైదరాబాద్ అభిమానులు తెగ రీ ట్వీట్ చేస్తున్నారు. ” హైదరాబాద్ జట్టు ఇప్పటికే నాలుగు ఓటములు ఎదుర్కొంది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్లలో ఓటమి అనేది ఎదురుగాకుండా చూసుకోవాలి. భారీ పరుగుల తేడాతో గెలవాలి. అప్పుడే ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుంది. లేకుంటే మిగతా జట్ల దయపై ఆధార పడాల్సి ఉంటుంది. బహుశా అందువల్లే కాబోలు హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ సరికొత్త విమానాన్ని తమ ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అనేక ఆధునిక సదుపాయాలు కల్పించింది. ఐపీఎల్ ముగిసేంతవరకు.. ఎయిర్ ఆసియాతో హైదరాబాద్ జట్టు ఒప్పందం కుదురుచుకుంది. ఈ ప్రకారం ఆడే మ్యాచ్ల వేదిక వద్దకు ఎయిర్ ఆసియా విమానం ఆటగాళ్లను తీసుకెళ్తుంది. అయితే కొత్తవి మానం హైదరాబాద్ జట్టు లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో.. ఎలాంటి విజయాలు దక్కేలా చేస్తుందో చూడాల్సి ఉందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: కేఎల్ రాహుల్ భయ్యా నీకో దండం.. నిజంగా నువ్వు దూతవే..
A SPECIAL FLIGHT FOR SUNRISERS HYDERABAD IN IPL 2025 WITH AIRASIA pic.twitter.com/Qqgb2EY8rr
— Johns. (@CricCrazyJohns) April 10, 2025