Puri Jagannath and Vijay Sethupathi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannad). ఆయన చేసిన సినిమాలన్నీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇక కెరియర్ స్టార్టింగ్ లో ఆయన వరుసగా సక్సెస్ లను సాధించడమే కాకుండా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ వాళ్లందరికి సపరేటు మేనరిజమ్స్ ని కూడా అందించాడు. ఇక ఏ హీరో అయినా కూడా పూరి జగన్నాథ్ సినిమాకి ముందు పూరి జగన్నాథ్ సినిమా తర్వాత అనేంతలా మేకోవర్ ను సంపాదించుకుంటూ ఉంటారు. ఎవరికి వారు వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న ప్రతిసారి ప్రతి హీరో కూడా పూరి జగన్నాథ్ ని ఆశ్రయిస్తూ ఉండేవారు.ఇక గత కొన్ని రోజుల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు.ఇక గత సంవత్సరం చేసిన ‘డబుల్ ఇస్మార్ట్ ‘ (Double Ismart) సినిమా కూడా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో కొద్దిరోజుల పాటు గ్యాప్ తీసుకొని మరి ఇప్పుడు ఒక మంచి కథతో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ని హీరోగా పెట్టి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో టబు(Tabu)కూడా ఒక కీలకపాత్ర వహించబోతుంది అంటూ రీసెంట్ గా అనౌన్స్ చేశారు.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!
ఇక పూరి జగనాథ్ ఇప్పటివరకు ఆయన చేసిన యూత్ ఫుల్ కాన్సెప్ట్ లను పక్కనపెట్టి ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాని చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విజయ్ సేతుపతి తో పూరి జగన్నాథ్ చేయబోతున్న సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుందట.
ఇక ఇంతకు ముందు విజయ్ సేతుపతి చేసిన మహారాజా సినిమా ఎలాంటి సస్పెన్స్ ని అందిస్తూ ఒక హై ఫీల్ అయితే ఇస్తుందో అలాంటి జానర్ లోనే సినిమాని కూడా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని సాధించి తన అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులందరిని ఆనందపడేలా చేస్తాడా? లేదంటే ఈ సినిమాని కూడా డిజాస్టర్ గా మారుస్తాడా? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ తో విజయ శతపతి సినిమా చేస్తున్నాడని తెలియగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిలో విపరీతమైన నటించింది క్రియేట్ అయింది ఇక ఆటోమేటిక్గా ఈ సినిమా మీద భారీ బస్ కూడా వస్తుంది మరి వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలాంటి కథతో వస్తుంది విజయ్ సేతుపతి ఎలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు అనేది తెలియాలన్న కూడా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?