RCB Vs DC IPL 2025: భువనేశ్వర్ కుమార్ గత సీజన్ వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు. అయితే అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం జట్టులో ఉంచుకోకపోవడం.. వేలంలో కొనుగోలు చేయకపోవడంతో.. బెంగళూరు జట్టు ఒక్కసారిగా అలర్ట్ అయింది. దొరికిందే అవకాశం అనుకొని 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మారిపోయాడు. అయితే ఇప్పుడు అతడు ఐపిఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మామూలుగా అయితే తన మాయాజాలం లాంటి బంతులతో ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే భువనేశ్వర్.. ఇప్పుడు బెంగళూరు జట్టుకు సరికొత్త అస్త్రంగా మారాడు.
Also Read: కేఎల్ రాహుల్ భయ్యా నీకో దండం.. నిజంగా నువ్వు దూతవే..
మూడో బౌలర్ గా..
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో యజువేంద్ర చాహల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే 164 మ్యాచ్లలో 206 వికెట్లు పడగొట్టి.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు చాహల్. అతని తర్వాత స్థానంలో పీయూష్ చావ్లా ఉన్నాడు. ఇతడు 192 మ్యాచ్ లలో 192 వికెట్లు పడగొట్టి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ ద్వారా రెండు వికెట్లు పడగొట్టి.. మొత్తంగా తన ఖాతాలో 181 వికెట్లు వేసుకొని.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ మూడో స్థానానికి వచ్చేసాడు. ఇక చెన్నై జట్టు ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. 217 మ్యాచ్లు ఆడిన అతడు 155 వికెట్లు పడగొట్టాడు. బ్రావో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. 161 మ్యాచ్లు ఆడిన అతడు 183 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ మెక్ గుర్క్(7), అభిషేక్ పోరెల్ (7) వికెట్లను సాధించాడు. తద్వారా ఢిల్లీ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. మరో బౌలర్ యశ్ దయాళ్ ఢిల్లీ మరో ఓపెనర్ డూ ప్లెసిస్(2) వికెట్ సొంతం చేసుకున్నాడు.. ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ (15) ను సుయాష్ శర్మ అవుట్ చేసాడు. బెంగళూరు విధించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించాలంటే ఢిల్లీ ఇంకా ఈ కథనం రాసే సమయం వరకు 68 బంతుల్లో 106 పరుగులు చేయాలి. క్రీజ్ లో కేఎల్ రాహుల్ (25), స్టబ్స్(0) ఉన్నారు.. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు సాధించగా.. సుయాశ్ యాదవ్, యశ్ దయాళ్ చెరొక వికెట్ సాధించారు. అయితే ఈ పిచ్ పై ముందుగా ఢిల్లీ బౌలర్లలో కొంతమంది మాత్రమే చెలరేగిపోయారు. అయితే బెంగళూరు జట్టు బౌలర్లు మాత్రం కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు.
Also Read: అక్షర్ బ్రో.. నీది బుర్రా.. పాదరసమా.. RCB ని నేల నాకించావ్ కదా!