RCB Vs DC 2025: ఆటగాడు ఒకే విధంగా ఆలోచించకూడదు. ముఖ్యంగా కెప్టెన్ ఒకే తీరుగా ఉండకూడదు. ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే.. ప్లాన్ బి ఉండాలి. అది కూడా కుదరకపోతే ప్లాన్ సి కూడా ఉండాలి. అక్కడ కూడా సాధ్యం కాకపోతే ప్లాన్ డీ కూడా ఉండాలి.
Also Read: ఐపీఎల్ లో మెయిడిన్ ఓవర్.. వికెట్ కూడానా.. ఎవరు భయ్యా నువ్వు?
ఇలాంటి క్వాలిటీలు ఉన్నవాళ్లే ఐపీఎల్ లాంటి టోర్నీలలో రాణిస్తారు. తమ జట్టును గెలిపిస్తారు. తము కూడా గెలుస్తారు. గెలిచే క్రమంలో సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తారు. అంతిమంగా విజయం సాధిస్తారు.. ఇక గురువారం బెంగళూరు, ఢిల్లీ జట్ల (RCB vs DC) పోటీ పడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) మరోసారి తను ఎంత స్మార్ట్ ఆటగాడినో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.. బౌలర్ గా ఈ మ్యాచ్ లో తన విఫలమైనప్పటికీ.. కెప్టెన్ గా మాత్రం తను విఫలం కాలేదు. ఇటీవల చెన్నై మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోనిని, విజయ్ శంకర్ ను అవుట్ కానీయకుండా.. అలాగని పరుగులు చేయకుండా నిలువరించాడు అక్షర్. ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ చెన్నై జట్టుకు చుక్కలు చూపించాడు. చివరికి చెన్నై జట్టు ఓడిపోయేలా చేశాడు. వికెట్లు తీయడమే కాదు.. వికెట్లు కాపాడటం కూడా జట్టుకు విజయాన్ని అందిస్తుందని నిరూపించాడు. ఇక బెంగళూరు జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించి.. పై చేయి సాధించేలా చేశాడు. ఒకానొక దశలో సూపర్ స్పీడ్ తో వెళ్తున్న బెంగళూరు జట్టు స్కోర్ కు స్పీడ్ బ్రేకులు వేశాడు. 3.5 ఓవర్లకు 61 పరుగులు చేసిన బెంగళూరు జట్టును నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగేలా చేసాడు.
ప్రయోగాలు చేశాడు
అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చాడు. మరో బౌలర్ స్టార్క్ మూడు ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ దశలో విప్రజ్ నిగం, ముఖేష్ కుమార్, కులదీప్ యాదవ్, మోహిత్ శర్మను నమ్ముకున్నాడు. ఇందులో విప్రజ్ విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యాను అవుట్ చేశాడు. కులదీప్ యాదవ్ రజత్ పాటిదర్, జితేష్ శర్మను అవుట్ చేశాడు. పడికల్ ను ముఖేష్ కుమార్, లివింగ్ స్టోన్ ను మోహిత్ శర్మ పెవిలియన్ పంపించారు . మొత్తంగా తన బౌలింగ్ లో బెంగళూరు ఆటగాళ్లు దంచి కొడుతున్న నేపథ్యంలో.. ఏమాత్రం అధైర్య పడకుండా.. ప్రయోగాలు చేసిన అక్షర్ పటేల్.. తనకున్న చాకచక్యం ద్వారా బెంగళూరు జట్టును.. వారి సొంత మైదానంలోనే 163 పరుగులకు కట్టడి చేయడం అంటే మామూలు విషయం కాదు . అందుకే అక్షర్ పటేల్.. స్మార్ట్ నెస్ విత్ బ్రెయిన్ అని ఢిల్లీ అభిమానులు పేర్కొంటున్నారు. ఇటీవల చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లోను అక్షర్ పటేల్ అద్భుతంగా ప్రణాళికల రూపొందించాడు. చెన్నై జట్టుపై ఢిల్లీ గెలిచే విధంగా చేశాడు.
Also Read: ఇది నా అడ్డా, ఇక్కడ నేనే తోపు… బెంగళూరులో చితక్కొట్టిన కేఎల్ రాహుల్