Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson Vs Shubman Gill Controversy: సంజు శాంసన్ పై గిల్ కు ఎందుకు...

Sanju Samson Vs Shubman Gill Controversy: సంజు శాంసన్ పై గిల్ కు ఎందుకు ఇంత జెలసి? మరీ ఇంత దారుణమా?

Sanju Samson Vs Shubman Gill Controversy: ఆటను ఆట మాదిరిగా చూడాలి. తోటి ఆటగాడు గొప్పగా ఆడుతుంటే ప్రోత్సహించాలి. అవసరమైతే తోడ్పాటు కూడా అందించాలి. ఇటీవల టీం ఇండియా ప్లేయర్ సంజు శాంసన్ సరిగా ఆడకపోతే సచిన్ టెండుల్కర్ అతనికి ఫోన్ చేశాడు. అతడి లోపాల గురించి పదేపదే చెప్పాడు. వాటినుంచి సంజు పాఠాలు నేర్చుకున్నాడు. ఆ లోపాలను పునరావృతం కాకుండా చూసుకున్నాడు. ఫలితంగా టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. టీమిండియాలో […]

Sanju Samson Vs Shubman Gill Controversy: ఆటను ఆట మాదిరిగా చూడాలి. తోటి ఆటగాడు గొప్పగా ఆడుతుంటే ప్రోత్సహించాలి. అవసరమైతే తోడ్పాటు కూడా అందించాలి. ఇటీవల టీం ఇండియా ప్లేయర్ సంజు శాంసన్ సరిగా ఆడకపోతే సచిన్ టెండుల్కర్ అతనికి ఫోన్ చేశాడు. అతడి లోపాల గురించి పదేపదే చెప్పాడు. వాటినుంచి సంజు పాఠాలు నేర్చుకున్నాడు. ఆ లోపాలను పునరావృతం కాకుండా చూసుకున్నాడు. ఫలితంగా టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. టీమిండియాలో గొప్ప గొప్ప ప్లేయర్లు వెనక్కి వచ్చేస్తే.. అతడు మాత్రం అద్భుతమైన ఆట తీరు చూపించి.. టీమిండియాను విజేతను చేశాడు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

సంజు ఆడిన తీరు పట్ల చివరికి గౌతమ్ గంభీర్ కూడా స్పందించాల్సి వచ్చింది. గౌతమ్ గంభీర్ అనేక సందర్భాలలో సంజు ఆట తీరు గురించి గొప్పగా చెప్పాల్సి వచ్చింది. ఇక మాజీ ప్లేయర్లు.. టీమిండియాలో ప్లేయర్లు సంజు ఆట తీరు గురించి రకరకాలుగా వర్ణించారు. అతడు చాలా గొప్ప ఆటగాడని.. జట్టు విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడని .. అతడి గురించి ఎంత ఎక్కువ చెప్పినా కూడా తక్కువేనని వ్యాఖ్యానించారు. చివరికి కేరళ ప్రభుత్వం కూడా సంజును గుర్తించింది. అతడికి డిఎస్పీ ఉద్యోగం ఇచ్చి సత్కరించింది.

సంజు శాంసన్ రేంజ్ ఈ స్థాయిలో ఉంటే..గిల్ దానిని తట్టుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో టీమిండియా టి20 వరల్డ్ కప్ స్వీకరించిన తర్వాత.. దిగిన ఒక ఫోటోను గిల్ పోస్ట్ చేశాడు. అయితే అందులో సంజు కనిపించలేదు. కావాలని గిల్ ఇలా చేశాడా? లేదా ఏదైనా తప్పు జరిగిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అయితే మెజారిటీ అభిమానులు మాత్రం గిల్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజు కు వస్తున్న మంచి పేరును తట్టుకోలేక గిల్ ఇలా చేశాడని.. సోషల్ మీడియాలో అతడు లేని ఫోటోలు పోస్ట్ చేశాడని.. వాస్తవమైన ఫోటోలలో అతడు ఉన్నప్పటికీ.. ఎడిట్ చేశారని మండిపడుతున్నారు. గిల్ అద్భుతమైన ఫోటో ఎడిటర్ అని పరోక్షంగా విమర్శిస్తున్నారు. ” టీమిండియా విజయం సాధించడానికి ముఖ్య కారణం సంజు. అలాంటి ఆటగాడి ఫోటో లేకుండా గిల్ జాగ్రత్తపడ్డాడు. అతడి ఫోటోను అద్భుతంగా ఎడిట్ చేశాడు. ఈ ప్రూఫ్ సరిపోతుంది కదా.. ఇంకా గిల్ గురించి చెప్పడానికి ఏముందని” నెటిజన్లు విమర్శిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper