SRH Vs RR
SRH Vs RR: హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR) మధ్య మధ్యాహ్నం 3:30 నుంచి మ్యాచ్ మొదలు కానుంది. ఇప్పటివరకు రాజస్థాన్, హైదరాబాద్ జట్ల మధ్య 20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 11 సార్లు విజయం సాధించింది. రాజస్థాన్ 9సార్లు విజయం సాధించింది. గత సీజన్లో రాజస్థాన్, హైదరాబాద్ రెండుసార్లు తలపడగా.. రెండుసార్లు కూడా హైదరాబాద్ గెలుపులను సొంతం చేసుకుంది. గత సీజన్లో ఆకాశమే హద్దు అయిపోయిన హైదరాబాద్ ఓపెనర్లు మరి ఈ సీజన్లో ఎలా రాణిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.. హైదరాబాద్ జట్టు గత ఏడాదితో పోల్చితే ఈసారి బలంగా కనిపిస్తోంది. విధ్వంసకరమైన బ్యాటర్లు.. అనుభవం కలిగి ఉన్న బౌలర్లతో హైదరాబాద్ అత్యంత పటిష్టంగా ఉంది. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్,క్లాసెన్ వంటి ప్లేయర్ లో ఉండడం.. హైదరాబాద్ సొంతమైదానం కావడంతో ఉప్పల్లో పరుగుల మోత ఖాయమని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి రావడం హైదరాబాద్ కు సానుకూల అంశం.. ఇక హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్, మహమ్మద్ షమీ పేస్ భారాన్ని మోస్తున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ జంపాకు అవకాశం లభించనుంది.
Also Read: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి ఆటగాడిగా రికార్డ్
రాజస్థాన్ ఎలా ఉందంటే..
గత సీజన్లో సంచలన విజయాలు సాధించి రాజస్థాన్ జట్టు ఆకట్టుకుంది. మొదట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు.. ఆ తర్వాత అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ చేతి వేలికి గాయమైంది. దీంతో జట్టును రియాన్ పరాగ్ నడిపించనున్నాడు. రాజస్థాన్ జట్టులో రియాన్ పరాగ్, హిట్ మేయర్, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జూరెల్ వంటి వారిపైనే బ్యాటింగ్ ఆధారపడి ఉంది. తుషార్ దేశ్ పాండే, మహేష్ తీక్షణ, జో ఫ్రా ఆర్చర్, ఫారుకి, ఆకాష్ మద్వాల్ వంటి వారిపైన బౌలింగ్ ఆధారపడి ఉంది. మొత్తంగా చూస్తే ఉప్పల్ మైదానం హైదరాబాద్ జట్టుకు అత్యంత అనుకూలమైన వేదిక. మరి ఈ మైదానపై హైదరాబాద్ ప్లేయర్లను కట్టడి చేసిన దానిపైనే రాజస్థాన్ విద్యా అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక గూగుల్ పిడిక్షన్ ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 60 శాతం, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 40 శాతం విజయవకాశాలు ఉన్నాయి. ఉప్పల్ సొంతమైదానం కావడంతో హైదరాబాద్ ఆటగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్లాట్ పిచ్ కావడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అలాగని చేజింగ్ చేసే జట్టుకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తానికి ఈ మైదానంపై పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది.