spot_img
Homeబిజినెస్Motorola Edge 70 Fusion: మొబైల్ ఎక్కువగా కొనడానికి కారణాలు ఇవే..

Motorola Edge 70 Fusion: మొబైల్ ఎక్కువగా కొనడానికి కారణాలు ఇవే..

Motorola Edge 70 Fusion: మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ వస్తుంటాయి. కానీ కొన్నిటికి మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఇటీవల Motorola మొబైల్స్ గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ కంపెనీకి చెందిన Edge 70 Fusion గత వారంలో భారతదేశంలో మార్కెట్లోకి వచ్చింది. మార్చి 12వ తేదీ నుంచి దీనిని అధికారికంగా కొనడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఈ మొబైల్ మార్కెట్లోకి రాగానే చాలామంది కొనాలని ఆసక్తి చూపుతున్నారు. వివిధ కంపెనీలకు చెందిన ఎన్నో రకాల మొబైల్స్ ఉండగా మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ పైనే ఆసక్తి చూపుతున్నారు. అసలు దీనిని కొనడానికి కారణమేమిటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని ధర ఎంత?

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

మొబైల్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అత్యవసరంగా మారిపోయింది. అందులోనూ మిడిల్ క్లాస్ పీపుల్స్ మొబైల్ తోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటున్నారు. దీంతో మార్కెట్లోకి ఏ కొత్త మొబైల్ వచ్చినా వెంటనే దానిని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే కంపెనీలు వీరికి అనుగుణంగా బడ్జెట్లో మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఇవి బడ్జెట్లో ఉన్నప్పటికీ ఇందులో ప్రీమియం ఫీచర్లను చేర్చుతున్నారు. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ ధర రూ.26,999 తో ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మొబైల్ రూ.30,000 లోపు కొనుగోలు చేయవచ్చు. అయితే దీని ధర ప్రీమియం కాకపోయినా.. ఫీచర్లు మాత్రం నేటి తరం వారికి అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మొబైల్ లో బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండనుంది. ఎందుకంటే ఇందులో 7000 mAh బ్యాటరీ ని అమర్చారు. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే 17 గంటల పాటు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజువారి వినియోగదారులతో పాటు వివిధ అవసరాలకు నిమిత్తం మొబైల్ పైనే ఆధారపడే వారికి ఇది యూస్ ఫుల్ గా ఉంటుంది. ఈ మొబైల్లో కెమెరా పనితీరు కూడా నాణ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా అమర్చారు. 13 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో పనిచేయని ఉంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఈ కెమెరాలతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారు ప్రత్యేకంగా కెమెరాలు కొనాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వాతావరణంతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లో కావలసిన ఫోటోలను అందిస్తుంది. ఏ ఐ ఫోటోలను కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ఉండడంతో ఒకేసారి ఎన్నో రకాల యాప్స్ యూస్ చేసిన వేగం తగ్గదు. ఇందులో గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎలాంటి వేడి కాకుండా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఇక ఈ మొబైల్ డిజైన్ చూడడానికి ఆకర్షనీయంగా ఉంటుంది. 7.99 ఎంఎం కొలతలు ఉండడంతో సన్నగా ఉండి చేతిలో పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ ఉండడంతో స్టైల్ గా కనిపిస్తుంది. అలాగే ఆకర్షణీయమైన రంగుల్లో ఉండడంతో ఈ మొబైల్ కు ఎక్కువగా ఆదరణ లభిస్తుందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version