spot_img
Homeక్రీడలుక్రికెట్‌Salman Agha Run Out: సల్మాన్ అఘా ను పిచ్చోన్ని చేసిన బంగ్లా బౌలర్.. ఫ్యూజులు...

Salman Agha Run Out: సల్మాన్ అఘా ను పిచ్చోన్ని చేసిన బంగ్లా బౌలర్.. ఫ్యూజులు ఎగిరిపోయే వీడియో ఇది!

Salman Agha Run Out: క్రికెటర్లకు.. ఆడటమే కాదు.. మైదానంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఆట మీద వారికి మరింత పట్టు లభిస్తుంది. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే దానికి తగ్గట్టుగా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఇటువంటి మూల్యాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాడు చెల్లించుకున్నాడు. అంతేకాదు, సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలకు గురవుతున్నాడు.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ చేతిలో తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో పాకిస్తాన్ బౌన్స్ బ్యాక్ అయింది. ఏకంగా 274 రన్స్ చేసి.. బంగ్లాదేశ్ జట్టును 114 పరుగులకు కుప్ప కూల్చింది. తద్వారా 128 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రెండో వన్డేలో మాజ్ సదాఖత్ (75), సల్మాన్ అఘా(64) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అయితే భారీ స్కోరు దిశగా వెళ్తున్న సల్మాన్ రనౌట్ అయ్యాడు. అప్పటికి ఇంకా 12 ఓవర్లు మిగిలి ఉన్నాయి. పాక్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ బౌలింగ్ వేస్తున్నాడు. అతడు బౌలింగ్ వేస్తున్న సమయంలో నాన్ స్ట్రైకర్ గా సల్మాన్ అఘా ఉన్నాడు. హసన్ వేసిన ఓవర్ లోని నాలుగో బంతిని స్ట్రైకర్ గా ఉన్న రిజ్వాన్ ఎదుర్కొన్నాడు. అయితే ఆ బంతి నేరుగా సల్మాన్ అఘా బ్యాట్ ను తగిలింది. ఆ బంతిని అందుకోవడానికి మిరాజ్ రెడీగా ఉన్నాడు. అయితే ఆ బంతి డెడ్ ఏమో అనుకున్న సల్మాన్.. ఆ బంతిని మిరాజ్ కు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆ బంతిని మిరాజ్ వికెట్ల వైపు త్రో చేశాడు.

ఈ వ్యవహారంలో సల్మాన్ స్పందించాడు. తాను బంతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. కానీ థర్డ్ ఎంపైర్ అతని వాదనతో ఏకీభవించలేదు. పైగా అవుట్ అని ప్రకటించడం. వాస్తవానికి హసన్ పొరపాటు ఇందులో ఏమీ లేదు. ఎందుకంటే అది డెడ్ బాల్ కాదు. క్రికెట్లో ప్రతిదీ తెలిసి ఉండాలని.. మైదానంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని.. అలా చేయనిపక్షంలో ఏ ఆటగాడికైనా ఇదే గతి పడుతుందని నెటిజన్లు అంటున్నారు. డెడ్ బాల్ అనుకున్నప్పుడు సల్మాన్ క్రీజు నుంచి బయటికి ఎలా వస్తాడని? బంతి విసురుతున్నప్పుడు రెస్పాండ్ కావాలి కదా అంటూ. మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సల్మాన్ అవుట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version