Indian Film Industry Star Directors: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు గొప్ప సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇండియాలో ఉన్న కొంతమంది స్టార్ డైరెక్టర్లు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఒక ముగ్గురు దర్శకుల వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అయిపోయిందని చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే రాజమౌళి, ప్రశాంత్ నీల్, శంకర్ లు కావడం విశేషం… ఇలాంటి దర్శకుల వల్లే చిన్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణ కు నోచుకోవడం లేదని భారీ విజువల్ వండర్స్ ని చూస్తున్న ప్రేక్షకులు చిన్న సినిమాల వైపు చూడటం లేదని చెబుతున్నారు. ఆ విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల మైండ్ సెట్ మార్చేశారని దానివల్ల చిన్న సినిమాలు, లో బడ్జెట్లో వచ్చే సినిమాల గురించి అసలు ఎవరు పట్టించుకోవడంలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!
ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతుంది. ఇంతే తప్ప లోకల్, రిలీజియన్ సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించడం లేదు. ఇక ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొద్ది రోజుల్లో చిన్న సినిమాలనేవి కనబడవు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
గత కొన్ని రోజుల నుంచి ఈ విషయం మీద తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి…ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో 1300 కోట్ల బడ్జెట్ తో వారణాసి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కనుక భారీ విజయాన్ని సాధిస్తే ఆయన నెక్స్ట్ 2000 కోట్లతో సినిమాని తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఇంత భారీ బడ్జెట్లో సినిమాలు వస్తున్నప్పుడు చిన్న సినిమాలను ఎవరు పట్టించుకుంటారు. సినిమాకి 400 రూపాయలు పెట్టి సినిమాని చూడడానికి ఇష్టపడే జనాలు చిన్న సినిమాకి 200 పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక పెద్ద సినిమాలకు పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవడాని టికట్స్ ను భారీ రేట్లకు అమ్ముకోవడం వల్ల సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా ఎవరికీ రావడం లేదు…
