IPL 2025 Opening Ceremony
IPL 2025 Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో దిశాపటాని మెరిసింది. ఆమె డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసినందుకు బిసిసిఐ కోటి దాకా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ ఆరంభ వేడుకల్లో దిశాపటాని మెరిసింది. శ్రేయ ఘోషల్ ప్రారంభ వేడుకల్లో పాటలతో అదరగొట్టింది. ముఖ్యంగా పుష్ప -2 సినిమాలో సూసేకి పాటను పాడి ఆకట్టుకుంది. శ్రేయ పాటల ప్రదర్శన పూర్తయిన తర్వాత దిశా ఎంట్రీ ఇచ్చింది. దిశా తన అందమైన భంగిమలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. సాధారణంగా దిశ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆరంభ వేడుకల్లోనూ దిశ అదే స్థాయిలో దుస్తులు ధరించింది. తెలుపు, గులాబీ వర్ణం కలబోతతో రూపొందించిన దుస్తులను ధరించి దిశ ప్రేక్షకులను మైమరిపింప చేయడానికి ప్రయత్నించింది.. అయితే దిశా డ్యాన్స్ మూమెంట్స్ హాట్ గా ఉండడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతమైన చర్చ సాగుతోంది.
Also Read: నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీ.. గెలిచేది ఈ జట్టే..
ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడకుండా..
ప్రారంభ వేడుకల్లో దిశా వేసిన డ్యాన్సులు అభ్యంతర కరంగా ఉండడంతో.. ఫ్యామిలీ ఆడియోస్ కాసేపు చూడకుండా ఉండేందుకు ఆమె ప్రదర్శనను నిలిపివేసినట్టు తెలుస్తోంది. కెమెరాలను ఇతర కార్యక్రమాల వైపు కవర్ చేసినట్లు సమాచారం. దీంతో యువ ఆడియన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. దిశా ప్రదర్శనను పూర్తిగా తనకు ఎందుకు చూపించలేదని వారు సోషల్ మీడియా వేదికగా ఐపిఎల్ నిర్వహణ కమిటీని ప్రశ్నిస్తున్నారు. ” ఏమి బాగోలేదు.. ప్రదర్శన గొప్పగా లేదు. దిశా పటాని డ్యాన్స్ ఆకట్టుకోలేదు. అసలు ఆమె ప్రదర్శనను మధ్యలో ఎందుకు నిలిపివేశారు.. మేము చాలా ఇబ్బంది పడ్డాం.. మాకు దిశపటాని డాన్స్ చేస్తుంటే చూడాలని ఉంది.. ఆమె అందం ఖజురహో శిల్పం లాగా ఉంది. పొట్టి బట్టల్లో ఆమె అదిరిపోయింది. కానీ ఆమె పెర్ఫార్మన్స్ పూర్తిగా చూపించకుండానే మధ్యలో కట్ చేశారని” సోషల్ మీడియా వేదికగా అభిమానులు మండిపడుతున్నారు.. అన్నట్టు దిశ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా జియో హాట్ స్టార్ వ్యూస్ పెరిగిపోయాయి. అప్పటిదాకా రెండు కోట్లలోపు ఉన్న వ్యూస్.. ఒకసారిగా మూడు కోట్లను దాటిపోయాయి. ఇదంతా కూడా దిశ మహిమ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.. వేదిక మీదికి విరాట్ కోహ్లీ, రజత్ పాటిదర్, రింకూ సింగ్ వంటి వారిని పిలిచి వారితో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి స్టెప్పులు వేశాడు. వేదిక మీద ఉన్నంత సేపు షారుఖ్ ఖాన్ తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు.
Disha Patani #DishaPatani #KKRvsRCB pic.twitter.com/lROZ7CnVcl
— (@igXhotz) March 22, 2025