Dilruba Movie: యూత్ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు తీస్తూ వస్తున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకపోయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపుని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉన్న యువ హీరోలలో మంచి భవిష్యత్తు ఉన్న హీరో ఇతనే అనే నమ్మకం ట్రేడ్ కి కూడా కలిగించాడు. అయితే ఇతను క్రమంగా సూపర్ హిట్స్ ని అందించలేకపోతున్నాడు. ఒక సూపర్ హిట్ సినిమా తీస్తే, వరుసగా రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు. వరుసగా మూడు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత ఆయన గత ఏడాది ‘క'(Ka Movie) చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని ట్రాక్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో ఇక ట్రాక్ లో పడ్డాడు, ఇక నుండి అన్ని సూపర్ హిట్స్ వస్తాయని అందరూ ఆశించారు.
కానీ అది జరగలేదు, ‘క’ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘దిల్ రూబ'(Dilruba Movie) అనే చిత్రం విడుదలైంది. విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై హైప్ ని క్రియేట్ చేయడంలో విఫలం అయ్యారు మేకర్స్. అందుకే ఓపెనింగ్స్ కనీస స్థాయిలో కూడా లేదు. ఇక రెండవ రోజు నుండి అయితే చెప్పక్కర్లేదు. కనీసం థియేటర్స్ నడవడానికి అవసరమయ్యే కరెంటు ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. అంత ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం. కేవలం 60 లక్షల రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా, రెండవ రోజు అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. ఇక మూడవ రోజు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వచ్చిన షేర్ వసూళ్లు కూడా డెఫిసిట్స్ లో కట్ అయిపోయాయి.
ప్రొమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రొమోషన్స్ మెటీరియల్ కోసం దాదాపుగా మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేశాడు నిర్మాత. వాటికి చేసిన ఖర్చులో పావు శాతం వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది. ట్రేడ్ పండితులు అందించిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు క్లోజింగ్ లో కేవలం 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇంత దరిద్రంగా క్లోజింగ్ ఇటీవల కాలం లో ఏ సినిమాకు కూడా దక్కలేదు. అది కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత. అట్టర్ ఫ్లాప్ గా పిలవబడే లైలా చిత్రానికి కూడా ఫుల్ రన్ లో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ దీనికి మాత్రం 40 లక్షల షేర్ వసూళ్లు వచ్చింది. కిరణ్ అబ్బవరం కి ఇది డేంజర్ బెల్స్. ఇక నుండి కెరీర్ పై జాగ్రత్తలు తీసుకోకుంటే ఆయనతో సినిమాలు చేయడానికి ఎవ్వరు ముందుకు రారు.