spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ravindra Jadeja Rajasthan Royals IPL 2026 Entry: జడేజాకు గ్రాండ్ వెల్కమ్.. దురంధర్ సినిమాను...

Ravindra Jadeja Rajasthan Royals IPL 2026 Entry: జడేజాకు గ్రాండ్ వెల్కమ్.. దురంధర్ సినిమాను మక్కికి మక్కి దింపేశారుగా..

Ravindra Jadeja Rajasthan Royals IPL 2026 Entry: ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచడానికి నిర్వాహక కమిటీ రకరకాల ప్రణాళికలు రూపొందిస్తోంది. పీఆర్ టీం లను ఏర్పాటు చేసుకొని సరికొత్తగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతో ఐపీఎల్ క్రికెట్ మీద ఆసక్తి మరింతగా పెరుగుతోంది..

Also Read: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘అల్లు సినిమాస్’..తెలుగు వాళ్లంటే అంత చులకనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభం కంటే ముందే అనేక సంచలనాలు నమోదయ్యాయి. అందులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. రవీంద్ర జడేజా చాలాకాలంగా చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. ఒక రకంగా మహేంద్ర సింగ్ ధోనికి కుడి భుజంగా వ్యవహరించాడు. 2023లో చెన్నై జట్టు ట్రోఫీని గెలవడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. అయితే అంతటి ఆటగాడు ఊహించని విధంగా 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై జట్టు నుంచి రాజస్థాన్ వెళ్లిపోయాడు. దీనిని సగటు చెన్నై అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

చెన్నై జట్టులోకి రవీంద్ర జడేజాకు జైపూర్ విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. జట్టులో చేరిన క్రమంలో జడేజా రాజస్థాన్ అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ఇటీవల బాలీవుడ్లో విడుదలై.. సంచలన విజయాన్ని నమోదు చేసిన దురంధర్ సినిమాను మక్కికి మక్కి దింపేశాడు. ఇందులో ఖమ్మా ఘని.. రాజస్థాన్ అంటూ రాజస్థాన్ సంప్రదాయ పద్ధతిలో గట్టిగా పలికాడు. ఈ వెల్కం వీడియో రాజస్థాన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.

ఇప్పటివరకు చెన్నై ఆటగాడిగా రవీంద్ర జడేజా అద్భుతమైన ఆట తీరు కొనసాగించాడు. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ లో నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. అయితే చెన్నై జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా.. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించి 2026 సీజన్ నుంచి కొత్తగా కనిపించబోతున్నాడు. సాధారణంగానే దూకుడుగా ఆడే రవీంద్ర జడేజా.. 2026 సీజన్లో తమ జట్టుకు అద్భుతమైన విజయాలు అందిస్తాడని.. మెరుపు ఆట తీరు ప్రదర్శిస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా తాను 2026 ఐపిఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించాడు. దీంతో రవీంద్ర ఈసారి 2.0 లోడింగ్ అన్నట్టుగా ఆడతాడని అభిమానులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version