spot_img
Homeబిజినెస్Realme 16 Pro Plus 5G: మార్కెట్ ను షేక్ చేస్తున్న Realme కొత్త ఫోన్.....

Realme 16 Pro Plus 5G: మార్కెట్ ను షేక్ చేస్తున్న Realme కొత్త ఫోన్.. ఎందుకంటే?

Realme 16 Pro Plus 5G: ప్రస్తుతం కొత్త మొబైల్ కొనే వారి ఆలోచనలు విభిన్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా తమ ప్రొఫెషనల్ కు అనుగుణంగా ఫోన్ ఉండాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండాలని చూస్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీలు సైతం కెమెరా, బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వీటి నాణ్యత పెంచుతూ ఫోన్ ఎక్కువసేపు మన్నికగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి వాటిలో Realme కంపెనీ ఒకటి. ఈ కంపెనీ నుంచి ఈ సంవత్సరంలో 16 Pro Plus 5G అనే మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. దీని ఫీచర్స్, బ్యాటరీ పనితీరు చూసి టాప్ ఫోన్లకు పోటీ ఇస్తుందని అంటున్నారు. అలాగే గేమింగ్ కోరుకునే వారికి ఇది సపోర్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

ఈ ఏడాది జనవరి 6న మార్కెట్లోకి వచ్చిన Realme 16 Pro Plus 5G mobile మార్కెట్ ని షేర్ చేసిందని కొందరు అంటున్నారు. ముఖ్యంగా ఇందులోని కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏ మొబైల్ లో లేని విధంగా ఇందులో 200 MP మెయిన్ కెమెరాను అమర్చారు. ఈ కెమెరా లూమ కలర్ సెన్సార్ తో పని చేయనుంది. ఇది TUV సర్టిఫికెట్ ఇచ్చిన మొదటి సెన్సార్. ఈ సెన్సార్ తో ఫోటోగ్రఫీ కోరుకునే వారికి అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. అలాగే ఈ కెమెరా 3.5 x జూమ్ చేసినా కూడా ఎలాంటి నాణ్యత తగ్గదు. ఇందులో 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉండడంతో పాటు 50 MP పెరిస్కోప్ టెలిఫోటోలను తీసుకోవచ్చు. వీడియోలు తీసుకోవాలని అనుకునే వారికి 4k Resolution తగ్గకుండా ఫోటోలను అందిస్తుంది.

రియల్ మీ 16 ప్రో ప్లస్ 5G మొబైల్లో బ్యాటరీ పనితీరు మామూలుగా ఉండదని అనుకోవచ్చు. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉంది. ఇది 21 గంటల పాటు వీడియోలు చూసిన కూడా పవర్ తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ బ్యాటరీ కి 80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 45 నిమిషాల్లోనే దీని పూర్తి చార్జింగ్ అవుతుంది. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ కనిపిస్తుంది. దీనితోపాటు 8gb రామ్, 512 స్టోరేజ్ ఉండడంతో తగినంత ఫోటోలను, వీడియోలను, ఫైల్స్ ను నిలువ ఉంచుకోవచ్చు. ఇందులో GT బూస్ట్ CPU ని 15% వరకు క్రాక్ చేస్తుంది. వీటితోపాటు 5g కనెక్టివిటీ, వైఫై 6, బ్లూటూత్ 5.4, NFC, ఇన్ డిస్ప్లే, 300 శాతం స్టీరింగ్ ఆడియో వంటివి సౌకర్యంగా ఉంటాయి. ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేను చూడవచ్చు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీని ధర రూ.43,999 నుంచి విక్రయిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ లో ఇది అందుబాటులో ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version