Rajat Patidar : రజత్ పాటిదార్ వయసు ప్రస్తుతం 31 సంవత్సరాలు. ఇతడి స్వస్థలం ఇండోర్. పైగా అతడు ఆడేది ఇప్పుడు నాలుగవ ఐపిఎల్ సీజన్ మాత్రమే. ఇప్పటివరకు అతడు 27 మ్యాచులు ఆడాడు. ఇంత తక్కువ కాలంలో అతడు బెంగళూరు కెప్టెన్ అవ్వడానికి.. అతని ఆట తీరు లో అనూహ్య మార్పు చోటు చేసుకోవడమే దీనికి కారణం. తక్కువ మ్యాచ్ లు ఆడినప్పటికీ రజత్ పాటిదార్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. 7 1/2 సెంచరీలు ఉన్నాయి.. 2021లో రజత్ పాటిదార్ కు ఐపీఎల్ లో తొలిసారి అవకాశం లభించింది. అప్పుడు అతడిని బెంగళూరు జట్టు 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో అతడు నాలుగు మ్యాచ్లు ఆడాడు. 71 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సీజన్ తర్వాత బెంగళూరు అతడిని విడిచిపెట్టింది. తర్వాత జరిగిన వేలంలో మరే జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. 2022 సీజన్ ప్రారంభంలో లవ్ నీత్ సిసోడియా అనే ఆటగాడు గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానంలో కేవలం 20 లక్షలకే రజత్ పాటిదార్ ను బెంగళూరు మళ్ళీ జట్టులోకి తీసుకోండి. 2022లో అతడు మళ్ళీ జట్టులోకి వచ్చి అదరగొట్టాడు. మెరుపు ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆ సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో జట్టుపై 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెంగళూరు అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నాడు. అయితే గాయం వల్ల తర్వాతి సీజన్ మొత్తంలో రజత్ పాటిదార్ ఆటలేకపోయాడు.. అయితే సురేష్ రైనా, అభిషేక్ శర్మ తమను తాము విధ్వంసకర ఆటగాళ్లుగా ఎలా రూపొందించుకున్నారో..రజత్ పాటిదార్ కూడా తన బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకున్నాడు. 2022, 2024 సీజన్లో బ్యాటింగ్ మార్పును స్పష్టంగా చూపించాడు.
అదిరిపోయే ఆటతీరుతో..
తన తొలి సీజన్లో 115 స్ట్రైక్ రేట్ కొనసాగించిన రజత్ పాటిదార్ .. ఆ తర్వాత సీజన్లో 177 కు పెంచుకున్నాడు. ముస్తాక్ అలీ దేశవాళీ టీ 20 ట్రోఫీలో మరింత దూకుడుగా ఆడాడు. 60 కి పైగా సగటుతో, 186 కు పైగా స్ట్రైక్ రేట్ తో 428 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ లోనూ అదరగొట్టాడు. అందువల్లే అతడిపై బెంగళూరు జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచింది. దీనికి తోడు విరాట్ కోహ్లీ మద్దతు ఇవ్వడంతో రజత్ పాటిదార్ కెప్టెన్ అవ్వడానికి మార్గం ఈజీ అయిపోయింది. విరాట్ కోహ్లీ వాస్తవానికి కెప్టెన్ కావాల్సి ఉండగా.. దానికి అతడు ఒప్పుకోలేదు. పైగా రజత్ పాటిదార్ పేరును యాజమాన్యానికి సిఫార్స్ చేయడం.. అతని ఆట తీరు కూడా బాగుండడంతో 31 సంవత్సరాల వయసులోనే రజత్ పాటిదార్ బెంగళూరు జట్టుకు నాయకుడయ్యాడు. మరి 2025 సీజన్లో రజత్ పాటిదార్ నాయకత్వంలో బెంగళూరు భవితవ్యం ఎలా ఉంటుందో?