Duvvada Srinivas- Madhuri
Duvvada Srinivas- Madhuri : లేటు వయసులో ఘాటు ప్రేమికులు అంటే ముందుగా గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas) , దివ్వెల మాధురి. వీరి ప్రేమ వ్యవహారం, వివాదాలు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు.. వీరి ప్రేమ కూడా వేరు. సినీ సెలబ్రిటీస్ కు మించి మీరు ప్రేమ వ్యవహారం మోస్ట్ పాపులర్ అయ్యింది. వారిద్దరూ తిరుమల ఆలయం వద్ద రీల్స్ చేసినా.. ఇంకేది చేసినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అంత ముదురు ప్రేమ జంట అది. అయితే ఈ జంట కేవలం వాలెంటైన్స్ డే పరిమితం కాలేదు. వాలెంటైన్స్ వీక్ గా జరుపుకున్నారు. ప్రేమలో మునిగిపోయారు.
* రోజుకో తరహాలో
వాలెంటైన్స్ వీక్ కు( Valentine’s week ) సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విడుదలైంది. ట్రెండీగా నిలిచింది. ఫిబ్రవరి 7వ తేదీన మొదటి రోజు రోజ్ డేగా జరుపుకున్నారు. మాధురికి ఇష్టమైన గులాబీ పువ్వు అందించారు. రెండో రోజు 8న ప్రపోజ్ డే గా జరుపుకున్నారు. తనలో ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఐ లవ్ యు చెప్పుకున్నారు. 9న చాక్లెట్ డే గా జరుపుకున్నారు. మాధురికి ఇష్టమైన చాక్లెట్ ఇచ్చారు శ్రీనివాస్. 10న టెడ్డి డే గా జరుపుకున్నారు. ఆరోజు భారీ టెడ్డిని బహుమతిగా అందించారు శ్రీనివాస్. 11న ప్రామిస్ డే నాడు చనిపోయే వరకు నీ చేయి వీడనని ప్రామిస్ చేశారు మాధురి. 12న హగ్ డేను జరుపుకున్నారు. ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. 13న కిస్ డే గా జరుపుకున్నారు. 14న వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పుకొని ఈ వీడియోను విడుదల చేశారు.
* వీడియో విడుదల
ఐ లవ్ రాజా అంటూ మాధురి( Madhuri) ఈ వీడియోలో దువ్వాడకు తన ప్రేమను ప్రకటించింది. యువ ప్రేమికులకు తీసిపోని విధంగా ప్రేమను వ్యక్తపరుచుకొని.. ప్రేమ ఊసులు, చేసుకున్న బాసలు, ఇచ్చుకున్న కానుకలు చూసి నెటిజెన్లు ఫిదా అయ్యారు. ప్రేమికుల దినోత్సవం అంటే ఇది కదా అంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానించారు.
* వ్యాపార రంగంలోకి
ప్రస్తుతం ఈ జంట వ్యాపార రంగంలో( business field) అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వస్త్ర వ్యాపారం చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న వస్త్రాలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. హైదరాబాదులో కొత్త షోరూమ్ ను ప్రారంభించే పనిలో పడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆ షోరూంను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ ఇద్దరు. ఇంతలో సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కనువిందు చేస్తున్నారు.
అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు #WesupportLaila pic.twitter.com/JGePsk2SXX
— (@Shiva4TDP) February 13, 2025
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Duvvada srinivas and divvela madhuri celebrated valentines week
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com