Manchu Manoj : మోహన్ బాబు-మనోజ్ ల వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఆస్తుల పంపకాలే గొడవలకు కారణం అనే వాదన ఉంది. ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. ఇటీవల మనోజ్-మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మేజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ వారిని ప్రశ్నలు అడిగారు. మేజిస్ట్రేట్ ఎదుటే మోహన్ బాబు, మనోజ్ దూషణలకు దిగినట్లు సమాచారం.
మరోవైపు విష్ణు-మనోజ్ సోషల్ మీడియాలో కౌంటర్లు విసురుకుంటున్నారు. సింహం కావాలని ప్రతి కుక్కకు ఉంటుంది.. అని విష్ణు ఒక కామెంట్ పోస్ట్ చేయగా.. దానికి కౌంటర్ గా.. మనోజ్ ఘాటైన పోస్ట్ పెట్టాడు. గతంలో నాలుగు గోడల మధ్య ఉన్న మంచు ఫ్యామిలీ వివాదాలు రచ్చకెక్కాయి. మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న శ్రీ విద్యా నికేతన్ పై మనోజ్ ఆరోపణలు చేయడం విశేషం. యూనివర్సిటీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు నష్టపోతున్నారని మనోజ్ ఆరోపించాడు.
తాజాగా ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో మనోజ్.. తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పరోక్షంగా విష్ణు, మోహన్ బాబులకు వార్నింగ్ ఇచ్చాడు. రాయచోటిలో ‘జగన్నాథ్’ అనే మూవీ టీజర్ రిలీజ్ వేడుక జరిగింది. అతిథిగా హాజరైన మనోజ్ మాట్లాడుతూ.. నన్ను తొక్కాలని చూస్తున్నారు. నన్ను తొక్కాలన్నా.. పైకి లేపాలన్నా, అది నా అభిమానులకే సాధ్యం. ఈ ప్రపంచంలో ఇంకెవరి వల్లా కాదు.
మంచి పని కోసం పోరాటం చేస్తూనే ఉంటాను. అయిన వాళ్ళు అయినా.. బయట వాళ్ళు అయినా.. న్యాయం కోసం ఎంత వరకైనా వెళతాను, అన్నాడు. ఇక్కడ మనోజ్ పేర్లు ప్రస్తావించనప్పటికీ మోహన్ బాబు, విష్ణులను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడని సోషల్ మీడియా టాక్. మోహన్ బాబు నిర్మాత విష్ణు ‘కన్నప్ప’ టైటిల్ తో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఇది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
మరోవైపు మనోజ్ నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ లతో కలిసి భైరవం టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. అలాగే సోలో హీరోగా ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. మనోజ్ 2023లో భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నారు.