Homeఆంధ్రప్రదేశ్‌AP Cabinet Reshuffle: ఏపీలో 'ఉగాది' సంచలనం!

AP Cabinet Reshuffle: ఏపీలో ‘ఉగాది’ సంచలనం!

AP Cabinet Reshuffle: ప్రస్తుతం ఏపీలో( Andhra Pradesh) ఉగాది పై చర్చ సాగుతోంది. ఆరోజు ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా పలు నిర్ణయాలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా అధికార పగ్గాల మార్పు గురించి రాష్ట్రమంతటా జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం పీఠంపై లోకేష్ ను కూర్చోబెడతారు అనే ప్రచారం ఒకటి ఉంది. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ.. మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ టీం ను […]

AP Cabinet Reshuffle: ప్రస్తుతం ఏపీలో( Andhra Pradesh) ఉగాది పై చర్చ సాగుతోంది. ఆరోజు ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా పలు నిర్ణయాలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా అధికార పగ్గాల మార్పు గురించి రాష్ట్రమంతటా జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం పీఠంపై లోకేష్ ను కూర్చోబెడతారు అనే ప్రచారం ఒకటి ఉంది. అయితే ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ.. మంత్రివర్గంలో భారీ మార్పులు చేసే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ టీం ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తెస్తారన్న ప్రచారం మాత్రం పతాక స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన సంకేతాలు టిడిపి శ్రేణులకు వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు మాత్రం సమాచారం.

Also Read: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు..అందరూ గురువిందలే

* లోకేష్ చుట్టూ ప్రచారం..
లోకేష్ ( Nara Lokesh )కీలక బాధ్యతలపై అనేక రకాల చర్చలు జరుగుతుండగా.. బిజెపితో పాటు జనసేన స్పందన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే గతానికి భిన్నంగా లోకేష్ పై ఉన్న అభిప్రాయం బిజెపికి మారింది. లోకేష్ నాయకత్వాన్ని బిజెపి ప్రోత్సహించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో వారసత్వ మార్పులు జరిగినప్పుడు తమ పార్టీకి కూడా ఎదిగే అవకాశం దొరుకుతుందని బిజెపి లెక్కలు వేసుకుంటుంది.. బీహార్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి తమ ఉనికిని చాటుకున్నట్లే.. ఇక్కడ కూడా అదే ఆలోచన చేసే అవకాశం ఉంది.

* బలంగా ప్రత్యర్థి..
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ బలమైన ఓటు బ్యాంకుతో పటిష్ట స్థితిలోనే ఉంది. అందుకే కూటమి పార్టీలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు లోకేష్ పట్టాభిషేకం ఉండకపోవచ్చు. ముందుగా లోకేష్ టీం తో పటిష్ట పరుస్తారు. తరువాతే లోకేష్ ను ప్రమోట్ చేస్తారు. అయితే ఇప్పట్లో చంద్రబాబును మార్చే అవకాశం లేదు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబోలు. అయితే కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఓ అయిదుగురు వరకు మంత్రులు మార్పు చేస్తారని మాత్రం పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ ఉంది. ఏదిఏమైనా ఏపీలో మాత్రం ఉగాది పర్వదినం హాట్ టాపిక్ గా ఉంది. మరి ఎటువంటి సంచలనాలు నమోదు అవుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper