Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson Beast Mode IPL: 10 ఇన్నింగ్స్ లు.. రెండు సెంచరీలు.. మూడు హాఫ్...

Sanju Samson Beast Mode IPL: 10 ఇన్నింగ్స్ లు.. రెండు సెంచరీలు.. మూడు హాఫ్ సెంచరీలు.. బీస్ట్ మోడ్ అంటే ఇదేనేమో..

Sanju Samson Beast Mode IPL: వరుసగా మూడు హాఫ్ సెంచరీలు.. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు. మిగతావాళ్లు అవుట్ అవుతుంటే.. మాత్రం ధ్వజస్తంభం లాగా నిలబడ్డాడు. కఠినమైన బౌలర్లను సైతం సులభంగా ఎదుర్కొన్నాడు. ప్రతిబంతిని కసికొద్ది కొట్టాడు. అంతేకాదు తనను విమర్శించిన వారితో అభినందించేలా చేసుకున్నాడు. అంతేకాదు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి జట్టును శిఖర స్థానంలో నిలబెట్టాడు. అంతే కాదు ఎటువంటి అంచనాలు లేకుండా జట్టులోకి వచ్చి .. మెన్ […]

Sanju Samson Beast Mode IPL: వరుసగా మూడు హాఫ్ సెంచరీలు.. అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాడు. మిగతావాళ్లు అవుట్ అవుతుంటే.. మాత్రం ధ్వజస్తంభం లాగా నిలబడ్డాడు. కఠినమైన బౌలర్లను సైతం సులభంగా ఎదుర్కొన్నాడు. ప్రతిబంతిని కసికొద్ది కొట్టాడు. అంతేకాదు తనను విమర్శించిన వారితో అభినందించేలా చేసుకున్నాడు. అంతేకాదు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి జట్టును శిఖర స్థానంలో నిలబెట్టాడు. అంతే కాదు ఎటువంటి అంచనాలు లేకుండా జట్టులోకి వచ్చి
.. మెన్ ఆఫ్ ది టోర్నీ పురస్కారం సాధించాడు. చివరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అతడి ఆట తీరు అభినందించి.. ఈ రాష్ట్ర గొప్ప యోధుడు అని కీర్తించాడు.

పై ఉపోద్ఘాతం మొత్తం వింటూ ఉంటే మనకు గుర్తొచ్చే ఆ పేరు.. సంజు శాంసన్.. ప్రస్తుతం ఐపిఎల్ లో ఇతడు చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. రాజస్థాన్ జట్టుకు సారధిగా ఉన్న ఇతడిని చెన్నై యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ ఐపీఎల్లో తొలి మూడు మ్యాచ్లలో సంజు సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 56 బంతుల్లోనే 115 పరుగులు చేశాడు. ఆ తర్వాత పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 48 పరుగులు చేశాడు.. సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగులు చేసి విఫలమైనప్పటికీ
.. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 101* పరుగులు చేశాడు.

గడిచిన 10 t20 ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే సంజు ఏకంగా మూడు హాఫ్ సెంచరీలు.. రెండు సెంచరీలు చేశాడు. సమకాలీన క్రికెట్లో ఏ ఆటగాడు కూడా ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదు. అక్కడిదాకా ఎందుకు టి20లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ కూడా ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం లేదు. ముఖ్యంగా ప్రారంభంలో నిదానంగా ఆడుతున్న సంజు.. ఆ తర్వాత అదరగొడుతున్నాడు. పిచ్ స్వరూపాన్ని అర్థం చేసుకున్న తర్వాత.. బౌలర్ల మీద ఎదురు దాడికి దిగుతున్నాడు. అందువల్లే అతడు బీస్ట్ మోడ్ స్థాయిలో ఆడుతున్నాడు. అతడు దూకుడు చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లు భయపడిపోతున్నారు.

ముంబై జట్టు మీద చెన్నై ప్లేయర్లలో ఏ ఒక్కరు కూడా సరిగా ఆడలేదు. వాస్తవానికి సంజు గనుక గట్టిగా నిలబడకపోయి ఉంటే చెన్నై పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ సంజు జట్టు భారాన్ని మొత్తం తన భుజాల మీద మోసాడు. అందువల్లే చెన్నై జట్టు ఆస్థాయిలో స్కోర్ చేయగలిగింది. అంతేకాదు, అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. పాయింట్లు పట్టికలో ఏకా ఏకిన ఐదవ స్థానంలోకి వెళ్లిపోయింది. దీనంతటికీ ప్రధాన కారణం సంజు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper