Homeవార్త విశ్లేషణGhost Cycle Surat India: ఇదేం చిత్రం.. సైకిల్ నడుపుతున్న ఘోస్ట్.. చూస్తున్న జనాలు అలా...

Ghost Cycle Surat India: ఇదేం చిత్రం.. సైకిల్ నడుపుతున్న ఘోస్ట్.. చూస్తున్న జనాలు అలా ఉండిపోయారు గా

Ghost Cycle Surat India: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఘోస్ట్ రైడర్ అనే పేరుతో సినిమా వచ్చింది.. ఆ సినిమాలో ఘోస్ట్ మోటార్ సైకిల్ నడుపుతుంటాడు.. సమాజాన్ని పట్టిపీడించే వ్యక్తుల మీద దాడులు చేస్తుంటారు. అతడు ఒకసారిగా ఘోస్ట్ గా మారిపోయిన తర్వాత అతడు కనిపించడు. మానవాతీత రూపంలో అతడు సంఘవిద్రోహశక్తుల భరతం పడుతుంటాడు. అదంటే సినిమా కాబట్టి అలా ఉంటుంది. పైగా అందులో లిబర్టీ ఎక్కువగా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఇది సాధ్యమవుతుందా.. […]

Ghost Cycle Surat India: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఘోస్ట్ రైడర్ అనే పేరుతో సినిమా వచ్చింది.. ఆ సినిమాలో ఘోస్ట్ మోటార్ సైకిల్ నడుపుతుంటాడు.. సమాజాన్ని పట్టిపీడించే వ్యక్తుల మీద దాడులు చేస్తుంటారు. అతడు ఒకసారిగా ఘోస్ట్ గా మారిపోయిన తర్వాత అతడు కనిపించడు. మానవాతీత రూపంలో అతడు సంఘవిద్రోహశక్తుల భరతం పడుతుంటాడు.

అదంటే సినిమా కాబట్టి అలా ఉంటుంది. పైగా అందులో లిబర్టీ ఎక్కువగా ఉంటుంది. రియల్ లైఫ్ లో ఇది సాధ్యమవుతుందా.. ఒక మనిషి సమాజానికి కనిపించకుండా.. ఉండిపోవడం సాధ్యమేనా.. ఈ ప్రశ్నకు అవును అంటూ సమాధానం చెప్పాడు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి చెందిన యువ ఆవిష్కర్త శివం మౌర్య. ఇతడు రూపొందించిన సైకిల్ ను అదృశ్య వ్యక్తి తొక్కుతుంటాడు.. అంతేకాదు ఆ సైకిల్ ఇటీవల సూరత్ రోడ్లమీద రయిమంటూ పరుగులు తీసింది.. అంతేకాదు దీనికి అతడు ఘోస్ట్ సైకిల్ అని పేరు పెట్టాడు..

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. మెకానికల్ ఇంజనీరింగ్ ను కలిపి అతడు ఈ సైకిల్ రూపొందించాడు. తన సహచరుడు గురుప్రీత్ తో కలిసి మూడు నెలల పాటు కష్టపడి ఈ సైకిల్ తయారు చేశాడు. దీనికోసం 35వేల రూపాయలు ఖర్చు చేశాడు. ఈ సైకిల్ రోడ్డుపై పరుగులు పెడుతూ ఉంటుంది. అంతేకాదు బ్యాలెన్స్ నియంత్రించుకుంటుంది.. ఆ సైకిల్ అలా ముందుకు వెళుతూ ఉంటే.. కేవలం మొండెం దాకా ఉన్న మనిషి కాళ్లు పెడల్స్ తొక్కుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది.

స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ సైకిల్ మొత్తాన్ని నియంత్రించవచ్చు. దాని ద్వారా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయవచ్చు. రిమోట్ కంట్రోల్ తో కూడా ఈ సైకిల్ ను ఆపరేట్ చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్ ద్వారా సైకిల్ కు ముందుగానే ఒక మార్గాన్ని నిర్ణయించవచ్చు. ఆ మార్గంలో సైకిల్ దూసుకుపోతూ ఉంటుంది. అంతేకాదు బ్యాలెన్స్ కూడా నియంత్రించుకుంటూ ఉంటుంది. ఏవైనా అడ్డంకులు గనుక ఏర్పడితే గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆ మార్గాన్ని స్వయంగా మార్చుకుంటుంది. ఇంతకుముందు శివం గరుడ ఏఐ బైక్, సింగిల్ టైర్ స్కూటర్, రోబోటిక్ రిక్షా ను రూపొందించాడు.. శివం క్రియేటివ్ సైన్స్ పేరుతో ఒక సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేశాడు. దానిని 20 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper