Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson 2.0 transformation: సంజు శాంసన్ 2.0 ఎలా సాధ్యమైంది..

Sanju Samson 2.0 transformation: సంజు శాంసన్ 2.0 ఎలా సాధ్యమైంది..

Sanju Samson 2.0 transformation: సంజు శాంసన్.. మీడియాలో.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. వెస్టిండీస్ జట్టు తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 97* పరుగులు చేసిన అతడు.. టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. తద్వారా టీమిండియాను సెమీఫైనల్ కి తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్ కు ముందు సంజు శాంసన్ ఈ టోర్నీలో చెప్పుకునే స్థాయిలో పరుగులు తీయలేదు. జింబాబ్వే జుట్టుతో జరిగిన మ్యాచ్లో 22 పరుగులు చేసినప్పటికీ.. […]

Sanju Samson 2.0 transformation: సంజు శాంసన్.. మీడియాలో.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. వెస్టిండీస్ జట్టు తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 97* పరుగులు చేసిన అతడు.. టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. తద్వారా టీమిండియాను సెమీఫైనల్ కి తీసుకెళ్లాడు.

ఈ మ్యాచ్ కు ముందు సంజు శాంసన్ ఈ టోర్నీలో చెప్పుకునే స్థాయిలో పరుగులు తీయలేదు. జింబాబ్వే జుట్టుతో జరిగిన మ్యాచ్లో 22 పరుగులు చేసినప్పటికీ.. అవి అతడి స్థాయి రన్స్ కాదు. ఈ నేపథ్యంలో.. వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ కు ముందు అతని మీద ఎటువంటి అంచనాలు లేవు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంజు శాంసన్ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి వారు విఫలమైన చోట.. సంజు శాంసన్ నిలబడ్డాడు. విధ్వంసంతో పాటు.. వివేచన తో బ్యాటింగ్ చేశాడు.

Also Read: అవకాశాలు ఇచ్చినా నో యూజ్.. ఇంకా ఎందుకు జట్టు అభిషేక్ ను మోయాలి?

టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్ లో అద్భుతం అనే స్థాయిలో ఆడిన సంజు శాంసన్.. ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ అంచనా వేయలేదు. అసలు అతడు ఇలా తన బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవడం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలిసిపోయింది. ఇదే విషయాన్ని మ్యాచ్ ముగిసిన తర్వాత సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. సంజు జట్టులో స్థిరంగా స్థానం లేకపోవడంతో చాలా రోజులుగా ఇబ్బంది పడ్డాడు. చివరికి టి20 వరల్డ్ కప్ లో తనకు అవకాశం వచ్చినప్పటికీ.. తుది జట్టులో చోటు లభించకపోవడంతో ఆవేదన చెందాడు.

అభిషేక్ శర్మ విఫలం కావడం.. రింకు సింగ్ సత్తా చూపించలేకపోవడంతో.. జట్టులోకి సంజు శాంసన్ కు పిలుపు వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవద్దని సంజు శాంసన్ బలంగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. తన బ్యాటింగ్ లోపాలపై సీరియస్ గా దృష్టి పెట్టాడు. ఫలితంగా సూపర్ 8 మ్యాచ్ లో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. గతంలో నిర్లక్ష్యంగా షాట్ లు ఆడే అతడు.. వెస్టిండీస్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో ప్రారంభం నుంచి చివరిదాకా క్రీజ్ లో ఉన్నాడు. అత్యంత కఠినమైన లక్ష్యాన్ని ఒక్కడే భుజాలపై మోసాడు.. తనపై వస్తున్న విమర్శలకు బ్యాటింగ్ ద్వారా బలమైన సమాధానం చెప్పాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper