Homeక్రీడలుక్రికెట్‌SABH factor in Team India victory: టీమ్ ఇండియా గెలుపులో SABH ఫ్యాక్టర్.. దీని...

SABH factor in Team India victory: టీమ్ ఇండియా గెలుపులో SABH ఫ్యాక్టర్.. దీని వెనుక స్టోరీ ఏంటో తెలుసా..

SABH factor in Team India victory: క్రికెట్లో ఒక జట్టు గెలుపును అంత ఈజీగా తీసుకోరు. ముఖ్యంగా ఐసీసీ నిర్వహించే సెమీఫైనల్ లాంటి మ్యాచులలో ఒక జట్టు గెలుపుకు దోహదం చేసే వ్యవహారాలను చాలా లోతుగా పరిశీలిస్తారు. ఆ జట్టు ఆటగాళ్లు ఆడిన ఆట.. అమలు చేసిన వ్యూహాలు.. రచించిన ప్రణాళికలు.. ఇలా అన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తారు. గురువారం ముంబై వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో.. గెలుపు సూర్యకుమార్ యాదవ్ సేనను వరించింది. […]

SABH factor in Team India victory: క్రికెట్లో ఒక జట్టు గెలుపును అంత ఈజీగా తీసుకోరు. ముఖ్యంగా ఐసీసీ నిర్వహించే సెమీఫైనల్ లాంటి మ్యాచులలో ఒక జట్టు గెలుపుకు దోహదం చేసే వ్యవహారాలను చాలా లోతుగా పరిశీలిస్తారు. ఆ జట్టు ఆటగాళ్లు ఆడిన ఆట.. అమలు చేసిన వ్యూహాలు.. రచించిన ప్రణాళికలు.. ఇలా అన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తారు.

గురువారం ముంబై వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో.. గెలుపు సూర్యకుమార్ యాదవ్ సేనను వరించింది. ఏడు పరుగుల వ్యత్యాసంతో టీమిండియా గెలిచింది. ఈ గెలుపును కొంతమంది అభిమానులు గొప్పగా భావిస్తుంటే.. మిగతావారు చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా ఉందని పేర్కొంటున్నారు. ఒక పరుగు తేడాతో గెలిచినప్పటికీ అది విజయమే అవుతుంది కాబట్టి.. టీమిండియా సాధించిన గెలుపు ముమ్మాటికి గొప్పది.

టీమిండియా సాధించిన గెలుపులో SABH ఫ్యాక్టర్ ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో ఎస్ అంటే సంజు శాంసన్ అని అర్థం. అతడు వెస్టిండీస్ జట్టుతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 97* పరుగులు చేశాడు. సెంచరీ కాని సెంచరీ చేశాడు. ఆ తర్వాత సెమి ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మీద 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా 253 పరుగులు చేస్తే.. అందులో 89 సంజు బ్యాట్ నుంచి వచ్చాయి.

ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో.. భారత ఫీల్డర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్ లు పట్టాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ క్యాచ్ పట్టే క్రమంలో 23 మీటర్ల దూరం వెనక్కి వెళ్లి.. పరుగులు పెడుతూ క్యాచ్ అందుకున్నాడు. బెతల్ తో కలిసి టీం ఇండియా బౌలింగ్ మీద ఎదురుదాడి చేస్తున్న విల్ జాక్స్ ను కూడా అద్భుతమైన క్యాచ్ పట్టి వెనక్కి పంపించాడు. బంతిని అందుకునే క్రమంలో వేగంగా పరుగులు పెట్టాడు. రోప్ దాటే ప్రమాద ఉన్న నేపథ్యంలో.. దుబే వైపు బంతిని వితిరేశాడు. అయితే అతడు వెంటనే క్యాచ్ పట్టుకోవడంతో.. జాక్స్ అవుట్ అయ్యాడు.

ఇక బౌలింగ్లో బుమ్రా అద్భుతంగా బంతులు వేశాడు. టీమిండియా బౌలర్లు పరుగులు ఇవ్వడంలో పోటీ పడుతున్న క్రమంలో.. బుమ్రా 18 ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతడు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఇంగ్లాండ్ జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఆ ఓవర్లో 0, 1, 1, 2, 1, 1 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది.

20 ఓవర్ లో హార్దిక్ పాండ్యా టీమిండియాకు అద్భుతమైన వరాన్ని అందించాడు. ఈ ఓవర్ శివం దుబే వేశాడు. అతడు వేసిన తొలి బంతిని గట్టిగా కొట్టే ప్రయత్నం చేశాడు బెతల్. మొదటి పరుగు ఈజీ గానే తీశాడు . రెండో పరుగు విషయంలో తాపత్రయ పడుతుండగా.. మరో మాటకు తావు లేకుండా హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో బంతిని విసిరేశాడు. వికెట్ల వెనుక ఉన్న సంజు ఆ బంతిని వెంటనే అందుకొని చూస్తుండగానే రనౌట్ చేశాడు. ఫలితంగా బెతల్ ఔట్ అయ్యాడు. బ్యాట్ పరంగా సంజు.. బౌలింగ్ పరంగా బుమ్రా, ఫీల్డింగ్ పరంగా అక్షర్, హార్దిక్ అదరగొట్టడంతో.. టీమిండియా SABH ఫ్యాక్టర్ ను నిజం చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper