Homeక్రీడలుక్రికెట్‌Rohith Sharma : అదే రోహిత్ కెప్టెన్సీలో గొప్పతనం.. అందువల్లే టీమిండియా గెలిచింది..

Rohith Sharma : అదే రోహిత్ కెప్టెన్సీలో గొప్పతనం.. అందువల్లే టీమిండియా గెలిచింది..

Rohith Sharma  : దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలుపును సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొత్తంగా ఏడాది వ్యవధిలో టి20, ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియా గెలిచింది. ఐసీసీ ట్రోఫీలను గెలిచిన సందర్భంలో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. బలమైన జట్లను ఓడించి టీమ్ ఇండియాను విజేతగా నిలిపాడు. టి20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా విజేతగా నిలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్ లోను టీమిండియా ఫైనల్ మినహా.. అన్ని మ్యాచ్లలో విజయం సాధించి సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం జట్టు ఓటమికి కారణమైందని ఇప్పటికీ క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. ఒకవేళ నాటి మ్యాచ్లో రోహిత్ గనుక టాస్ గెలిచి ఉంటే కచ్చితంగా బౌలింగ్ ఎంచుకునేవాడని.. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు పరిమితం చేసి.. టీమిండియాను గెలిపించేవాడని వివరిస్తుంటారు. నాడు ఆస్ట్రేలియాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. రోహిత్ అయితే చిన్నపిల్లాడి లాగా ఏడ్చాడు.

Also Read : నవ్వినంత మాత్రాన ఒత్తిడి తగ్గిపోలేదు.. గౌతమ్ గంభీర్ ముందు ఎన్నో చిక్కుముడులు.. ఎలా విప్పుతాడో చూడాలి..

అదే అతడి గొప్పతనం

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. టీమిండియా ఒకప్పటి ఆటగాడు.. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు..” రోహిత్ నాయకత్వాన్ని చాలామంది తక్కువ చేసి చూశారు. కానీ అతడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమ్ ఇండియా(Team India)కు వరుసగా రెండు ట్రోఫీలను అందించాడు. రోహిత్ బౌలర్లను సమర్థవంతంగా వినియోగించుకుంటాడు. రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన ఆటగాళ్లతో నిత్యం మాట్లాడుతుంటాడు.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో అర్ష్ దీప్ సింగ్ ను కాదని హర్షిత్ రాణా కు అవకాశం ఇచ్చాడు. అనంతరం వరుణ్ చక్రవర్తికి స్థానం కల్పించాడు. తుది జట్టులో చోటు దక్కించుకొని వారిని సముదాయించాడు. ఈ నిర్ణయాల వల్లే రోహిత్ ఉత్తమ కెప్టెన్ గా నిలిచాడు. జట్టు గురించి తప్ప.. వ్యక్తిగతంగా రోహిత్ తక్కువ ఆలోచిస్తాడు. ఆటగాళ్లను సంతృప్త స్థాయిలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఆటగాళ్లకు ఇన్ సెక్యూర్ ఫీలింగ్ ఉంటే సరిగ్గా ఆడలేరని రోహిత్ అభిప్రాయం. అందువల్లే జట్టులో ఏ ఆటగాడు కూడా అలాంటి భావనతో ఉండకుండా రోహిత్ జాగ్రత్త పడుతుంటాడు. రోహిత్ పాటించిన ఈ విధానాలు టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ గెలవడానికి కారణమయ్యాయి. అంతకుముందు t20 వరల్డ్ కప్ నెగ్గడానికి దోహదం చేశాయి. మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్థానంలో రోహిత్ ఉండేలా చేశాయని” సేహ్వాగ్ వ్యాఖ్యానించాడు.. సేహ్వాగ్ చేసిన వ్యాఖ్యల పట్ల రోహిత్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ గురించి సెహ్వాగ్ గొప్పగా చెప్పాడని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : ఓరయ్యా ఇదేం బౌలింగ్..నా కాళ్ళనే విరగొట్టేందుకు ప్రయత్నించావ్.. బౌలర్ పై రోహిత్ చిందులు.. వైరల్ వీడియో

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular