Rohith Sharma : ఛాంపియన్స్ ట్రోఫీ (Champions trophy 2025) పాకిస్తాన్ వేదికగా రేపటి నుంచి మొదలుకానుంది. ఎనిమిది జట్లు ఈ ట్రోఫీ కోసం బరిలో ఉన్నాయి. భద్రత కారణాలు, రాజకీయ ఉద్రిక్తతల వల్ల టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచులు ఆడుతోంది. బీసీసీఐ విన్నపం మేరకు ఐసిసి టీమిండియా ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ మోడ్ విధానంలో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు దుబాయ్ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్నారు..నెట్స్ లో విపరితంగా కష్టపడుతున్నారు. ఇటీవల నెట్స్ లో సాధన చేస్తుండగా హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి రిషబ్ పంత్ కు తగిలింది. ఆ తర్వాత రిషబ్ పంత్ ఒకరోజు అనంతరం కోలుకున్నాడు. ఇప్పటికే గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఈ క్రమంలో గాయమైన రిషబ్ పంత్ కూడా ఈ టోర్నీకి దూరమవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అదృష్టవశాత్తు అతడు ఆ గాయం నుంచి కోలుకొని.. పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించాడు. దీంతో టీం ఇండియా అభిమానులకు బిగ్ రిలీఫ్ లభించింది.
రోహిత్ శర్మ కాళ్లు విరగొట్టడానికి..
దుబాయ్ వేదికగా ఆడే మ్యాచ్లలో.. అద్భుతమైన ప్రతిభ చూపించాలని టీమిండియా భావిస్తోంది. ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బౌలర్ అవాయిస్ అహ్మద్ బౌలింగ్లో అతడు ప్రాక్టీస్ చేశాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ ను అహ్మద్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.. ఈ స్పెషల్ మొత్తం పూర్తయిన తర్వాత రోహిత్ అతడని ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు. ” అరేయ్…ఏం బౌలింగ్ వేస్తున్నావ్ రా.. నువ్వు వేసే యార్కర్లు నా కాళ్ళు విరగ్గొట్టేలా ఉన్నాయి. బంతులు విపరీతమైన వేగంతో దూసుకు వచ్చాయి. అసలు ఆ బంతులను ఎలా ఆడాలో నాకు అర్థం కాలేదు. అసలు నీకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉందా? ఒకవేళ ఆ అనుభవం లేకుండా ఇలా బౌలింగ్ వేస్తున్నావంటే మామూలు విషయం కాదు.. భవిష్యత్తులో నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు కనిపిస్తాయి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. నువ్వు ప్రపంచ స్థాయి బౌలర్ అవుతావు. నీ ప్రతిభకు మరింత పదును పెట్టుకుంటే తిరుగులేని స్థాయిలో ఉంటావు. నీ బౌలింగ్ నాకు బాగా నచ్చింది. నీ బౌలింగ్లో ఆడాలంటే చాలా కష్టం అనిపించింది.. దుబాయ్ మైదానాలపై నా బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మార్చుకోవడానికి నీ బౌలింగ్ ఉపకరించింది. గొప్ప బౌలింగ్లో ఆడినందుకు గర్వంగా ఉంది. గొప్పగా బౌలింగ్ వేస్తున్నావ్.. నీకు నా ధన్యవాదాలు” అంటూ రోహిత్ అవాయిస్ అహ్మద్ తో వ్యాఖ్యానిచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి.
దుబాయ్ లో భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. లోకల్ బౌలర్ అవాయిస్ అహ్మద్ బౌలింగ్లో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేశాడు. అతడి ఇన్ స్వింగ్ బంతులకు ఇబ్బంది పడ్డాడు. ప్రాక్టీస్ అనంతరం నా కాళ్లు విరగ్గొడతావా అంటూ రోహిత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.#RohitSharma#ChampionsTrophy2025 pic.twitter.com/Tegr9OuqxC
— Anabothula Bhaskar (@AnabothulaB) February 18, 2025