TG Assembly Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budjet Meetings) ప్రారంభమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ఎన్నికల తర్వాత ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు వచ్చారు. తర్వాత అసెంబ్లీకి కాలేదు. తాజాగా బడ్జెట్ సమావేశాల తొలిరోజు హాజరయ్యారు.
Also Read: కరెంటు బిల్లు క్రమంగా పెరుగుతోందా.. గృహజ్యోతి వర్తించడం లేదా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla ChandraShekar Rao) (కేసీఆర్) బుధవారం(మార్చి 12న) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలు ప్రారంభమయ్యే గంట ముందే ఆయన అసెంబ్లీకి చేరుకోవడం గమనార్హం. అసెంబ్లీ వద్దకు వచ్చిన కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ(BRS legisletive Party) (ఎల్పీ) కార్యాలయంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారని సమాచారం.
అనారోగ్యం కారణంగా..
గతంలో ఆరోగ్య సమస్యల కారణంగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న కేసీఆర్(KCR), 2024 ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలకు హాజరైనప్పటికీ, ఆ తర్వాత మళ్లీ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా గంట ముందుగా అసెంబ్లీకి రావడం ఆయన తన ప్రతిపక్ష నాయకత్వ పాత్రను ఉత్సాహంగా నిర్వహించాలనే సంకేతంగా భావిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో గజ్వేల్(Gajwel) నుంచి గెలిచినప్పటికీ, హిప్ ఫ్రాక్చర్ కారణంగా కొంతకాలం విశ్రాంతిలో ఉన్న కేసీఆర్, ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీలో ఆయన రాకతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
వాడీవేడిగా సమావేశాలు..
అయితే కేసీఆర్ ఈసారి కూడా ఒక్క రోజుకే పరిమితమవుతారా లేక సమావేశాలు సాగినన్ని రోజులు వస్తారా లేదా అన్నది తెలియడం లేదు. ఆయన అసెంబ్లీకి వస్తే మాత్రం ఈ సమావేశాలు వాడీ వేడిగా జరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించడంతోపాటు, తెలంగాణ ప్రజల సమస్యలపై గట్టిగా పోరాడాలని తన పార్టీ సభ్యులకు సూచించారని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఉభయ సభలను ఉద్దేవించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్నంత సేపు అసెంబ్లీలో ఉన్న కేసీఆర్ ప్రసంగం ముగియగానే వెళిలపోయారు. పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీ ఆవరణలో మాట్లాడారు. కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు.
Leader of the Opposition and BRS President Sri KCR, has reached the State Legislative Assembly to participate in the State Budget Session scheduled to start today. pic.twitter.com/wSEMzOXzY5
— BRS Party (@BRSparty) March 12, 2025