Rishabh Pant Bat Slip: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. అలాగని జెంటిల్మెన్ లాగే ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు తోటి ఆటగాళ్లకు.. ప్లేయర్లకు.. అభిమానులకు, ప్రేక్షకులకు కొంతలో కొంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. వారిని నవ్వించాలి. వామ్మో ఇదేంటి ఇలా కూడా ఆడతారా అనేలాగా అనిపించాలి. ఇలా చేయాలంటే ఆటగాడిలో కాస్తలో కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఇలా ఉన్న ప్లేయర్ల జాబితాలో రిషబ్ పంత్ కు మొదటి స్థానం దక్కుతుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ బ్యాటింగ్ తో అద్భుతాలు చేస్తుండగా.. తన టైమింగ్ తో మైదానంలో నవ్వులు పూయిస్తున్నాడు.
Also Read: ఇంగ్లాండ్ దూకుడు.. ఒక్క ఓవర్లోనే 23 రన్స్
ఇంగ్లీష్ తో జరుగుతున్న రెండో టెస్టులో.. భారత రెండవ ఇన్నింగ్స్ సమయంలో హాఫ్ సెంచరీ చేసి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత మైదానంలోకి పంత్ వచ్చాడు. వచ్చి రావడమే ఆలస్యం టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. స్కోర్ బోర్డును రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో తనకు మాత్రమే సాధ్యమైన విన్యాసకరమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలర్ టంగ్ వేసిన 34 ఓవర్లో పంత్ విన్యాసం చేశాడు. టంగ్ వేసిన నాలుగో బంతిని భారీ షాట్ కొట్టడానికి పంత్ ప్రయత్నించాడు. ఈ దశలో అతడు బ్యాట్ మీద పట్టు కోల్పోయి వదిలేశాడు. బ్యాట్ అమాంతం గాల్లో లేచి కిందపడిపోయింది. ఆ ప్రదేశంలో ఇంగ్లాండ్ ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే ఎవరికో ఒకరికి కచ్చితంగా గాయం అయ్యేది. ఎందుకంటే పంత్ వాడే బ్యాట్ బరువుంటుంది.
పంత్ బ్యాట్ వదిలేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక పర్యాయాలు షాట్ లు కొట్టబోయి అతడు ఇలాగే బ్యాట్లను వదిలేశాడు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఫీల్డర్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వాస్తవానికి బ్యాటింగ్ చేసే క్రమంలో రిషబ్ పంత్ బంతిని మాత్రమే చూస్తాడు. బ్యాట్ ఎలా పట్టుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోతాడు. అందువల్లే బ్యాట్ ను వదిలేస్తాడు.
Also Read: కోహ్లీ 5 బౌలర్ల ఫార్ములానే హిట్.. గంభీర్-గిల్ ఆల్ రౌండర్ల ప్లాన్ ఫెయిల్!
ఇక ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లో రిషబ్ పంత్ ఇప్పటికే రెండు సెంచరీలు పూర్తి చేశాడు. తొలి టెస్టులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారీగా పరుగులు చేసే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం రెండవ ఇన్నింగ్స్ లో 27 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి.. ఇక తొలి ఇన్నింగ్స్ లో పంత్ 25 పరుగులు చేసి బషీర్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న రెండవ ఇన్నింగ్స్ లో పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్ తో కలిపి భారత్ లీడ్ 300 పరుగులను మించిపోయింది.
THE BAT FLYING FROM RISHABH PANT pic.twitter.com/qxr1iOtCCz
— Johns. (@CricCrazyJohns) July 5, 2025