Kerala Cricket Star: కేరళ ఆటగాడు సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఫామ్ లో లేకున్నా విపరీతమైన క్రేజ్ అతడికి కేరళ రాష్ట్రంలో ఉంటుంది. అతడి స్వస్థలం కేరళ రాష్ట్రం. అందువల్లే అక్కడి క్రికెట్ అభిమానులు అతన్ని విపరీతంగా ఆరాధిస్తుంటారు. శ్రీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆటగాడిగా సంజు కొనసాగుతున్నాడు. అప్పట్లో సంజుకు జాతీయ జట్టులో అవకాశాలు లభించినప్పుడు సోషల్ మీడియాలో కేరళ అభిమానులు ఒక యుద్ధమే చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేరళ ఆటగాడు అయినందువల్లే సంజుకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అతడికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ కూడా చేశారు.
గత ఏడాది నుంచి సంజు టీమిండియా టి20 ఫార్మాట్లో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా పర్యటనలో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో అతడికి జట్టులో స్థానం సుస్థిరమైపోయింది. ఫలితంగా అతడి నుంచి మెరుగైన ఇన్నింగ్స్ రావడం ప్రారంభమైంది. అప్పట్లో సంజు కెరియర్ గురించి మాట్లాడుతూ అతడు తండ్రి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. మేనేజ్మెంట్లో రాజకీయాల వల్ల తన కుమారుడి కెరియర్ నాశనమైందని మండిపడ్డాడు. దీని అంతటికి క్రికెట్ బోర్డులోని పెద్దలు.. అప్పటి సీనియర్ ఆటగాళ్లు కారణమని ఆరోపించాడు. అప్పట్లో సంజు తండ్రి చేసిన ఆరోపణలు చర్చకు కారణమయ్యాయి. ఇక రాజస్థాన్ జట్టుకు ఐపీఎల్ లో సారధిగా వ్యవహరిస్తున్నాడు సంజు. గత సీజన్లో అతడు రాజస్థాన్ జట్టును ముందుండి నడిపించాడు.దురదృష్టవశాత్తు ప్లే ఆఫ్ లోనే రాజస్థాన్ కథ ముగిసిపోయింది. అయినప్పటికీ గొప్ప గొప్ప జట్లను ఓడించి రాజస్థాన్ అక్కడిదాకా చేరుకుంది. ఇక ఈ సీజన్లో సంజు గాయపడిన నేపథ్యంలో రాజస్థాన్ జట్టు చుక్కాని లేని నావలాగా మారిపోయింది. గ్రూప్ దశ నుంచే రాజస్థాన్ జట్టు ఇంటికి వెళ్లిపోయింది.
Also Read: పంత్ కొడితే బాల్ కు తగల్లేదు.. గాల్లో లేచి ఎగిరిపోయింది.. అట్లుంటది రిషబ్ తోని.. వీడియో
రాజస్థాన్ జట్టు దారుణమైన ఆట తీరు కొనసాగించడం.. ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో సంజు వచ్చే ఐపిఎల్ సీజన్లో చెన్నై జట్టుకు వెళ్తాడని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నై మేనేజ్మెంట్ ఈ దిశగా సంకేతాలు కూడా ఇచ్చింది. వచ్చే సీజన్లో సంజు వేలంలోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో అతడిని కొనుగోలు చేయడానికి చెన్నై మేనేజ్మెంట్ సిద్ధంగా ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవి ఇలా ఉండగానే సంజు కి సంబంధించిన మరో వార్త మీడియాను ఊపేస్తోంది. త్వరలో కేరళ కేంద్రంగా కేరళ క్రికెట్ లీగ్ జరగనుంది. ఈ లీగ్ లో సంజు రికార్డు స్థాయిలో ధరకు అమ్ముడుపోయాడు. అతడిని కేరళ క్రికెట్ లీగ్ లోని ఓ జట్టు 26.8 లక్షలకు కొనుగోలు చేసింది. ఇది కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర అని అక్కడ మీడియా చెబుతోంది. ” సంజు కు విపరీతమైన క్రేజ్ ఉంది. అందువల్లే అతడిని భారీ ధరకు కొనుగోలు చేశారు. 26.8 లక్షలకు అమ్ముడు పోయాడు అంటే అతని మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చని” కేరళ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.