Low Salaries and High Stress: ఆ సుప్రసిద్ధ జర్నలిస్ట్ నడుపుతున్న పత్రికలో వేతనాలు అంతంత మాత్రమే ఉంటాయి. అయినప్పటికీ గత్యంతరం లేక ఉద్యోగులు అందులోనే పనిచేస్తుంటారు. వేరే ఉద్యోగం లభించక.. అప్పటికే వయసు అయిపోవడంతో.. వేరే మార్గం లేక అన్నీ మూసుకుని పనిచేస్తుంటారు. అదే సుప్రసిద్ధ జర్నలిస్ట్ నడుపుతున్న న్యూస్ ఛానల్ లోనూ పని చేసే సిబ్బంది పరిస్థితి పత్రికలో వారి మాదిరిగానే ఉంటుంది. అంతంతమాత్రంగా జీతాలు.. బండెడు చాకిరి.. ఏదో పొడుద్దామని.. ఇంకేదో చేద్దామని మీడియాలోకి వస్తే.. చివరికి పరిస్థితి ఇలా అయిందని ఆ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి బాధపడుతూనే ఉంటాడు. వారి బాధ ఇక్కడ చెబితే చరిత్ర అవుతుంది.. వివరిస్తే గ్రంథం అవుతుంది.
Also Read: బేసిన్లు, బెండకాయలు అంటే ఇజ్జత్ పోతది.. రేవంత్ పై కేటీఆర్ సెటైర్ వైరల్
పత్రిక, న్యూస్ ఛానల్ మాత్రమే కాదు.. ఆ సుప్రసిద్ధ జర్నలిస్టు నడుపుతున్న డిజిటల్ మీడియాలో కూడా శ్రమ దోపిడీ బీభత్సంగా ఉందట. ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా ఇన్ ఛార్జ్ పని ఒత్తిడి తట్టుకోలేక వేరే సంస్థలోకి వెళ్లి పోయాడట. అతని స్థానంలో వేరే వ్యక్తిని తీసుకున్నారట. అప్పటిదాకా ఆ డిజిటల్ మీడియాను నడిపిన వ్యక్తికి అంతంత మాత్రమే జీతం ఇస్తే.. కొత్తగా అతడి స్థానంలో తీసుకున్న వ్యక్తికి ఏకంగా ఒక లకారాన్ని మించి జీతం ఇస్తున్నారట. ఇక ఇన్ని రోజుల పాటు పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం ఆ సంస్థ జీతాలు పెంచే విషయంలో లెక్కలు చెబుతున్నదట. ఇటీవల కాలంలో వేతనాల పెంపుదల జరిగినప్పటికీ.. అది చెప్పుకునే స్థాయిలో కాదట. అసలు హైదరాబాద్ నగరంలో జీవనం.. బీభత్సమైన ఇంటి అద్దెలు.. ఇతర ఖర్చులు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని జీతాలు పెంచాల్సి ఉండగా మేనేజ్మెంట్ ఏమాత్రం పట్టించుకోలేదట. దీంతో ఆ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు రాజీనామా బాటలో ఉన్నారట. ఇప్పటికే కొంతమంది సంస్థను వీడి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
Also Read: పవన్ ను పాయింట్ తో కొట్టిన పేర్ని నాని
అక్కడ పనిచేసే సిబ్బందితో న్యూస్ రాయించడం.. ఫోటోషాప్ వర్క్ చేయించడం.. అప్లోడ్ చేయించడం.. ట్యాగ్స్ కూడా వారితోనే పెట్టించడం వంటివి చేస్తున్నారట. ప్రతిరోజు సుమారు 12 నుంచి 14 వరకు ఆర్టికల్స్ అప్లోడ్ చేయాలని చెబుతున్నారట. దీంతో డిజిటల్ మీడియాలో పనిచేసే సిబ్బంది నరకం చూస్తున్నారట. వాస్తవానికి సిబ్బంది ఆర్టికల్స్ మాత్రమే రాయాలి. పోటీ సంస్థల్లో పని చేసే సిబ్బంది కేవలం కంటెంట్ రాయడం వరకే పరిమితం అవుతున్నారు. కానీ సదరు సుప్రసిద్ధ జర్నలిస్టు నడుపుతున్న డిజిటల్ మీడియాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పని ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో చాలామంది ఉద్యోగులు బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారట.. మరోవైపు ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన ఇన్ ఛార్జ్ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్నాడట. నడుపుతున్న పత్రికలో శ్రమ దోపిడీ.. ఛానల్లోనూ అదే పరిస్థితి.. ఇప్పుడు డిజిటల్ మీడియాలోనూ అదే ధోరణి ఆ మేనేజ్మెంట్ కొనసాగించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ తమ విషయంలో చూపిస్తున్న ధోరణి మార్చుకోవాలని సూచిస్తున్నారు.