Ind Vs Eng 2nd Test Day 3: ఇండియాతో జరుగుతున్నా రెండో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు బ్రూక్, స్మిత్ దూకుడుగా ఆడుతున్నారు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రసిద్ద్ వేసిన 32వ ఓవర్ లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు సాధించాడు. ఈ ఒక్క ఓవర్ లోనే 23 రన్స్ వచ్చాయి. ప్రస్తుతం టీ సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ 169 గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ 6 ఓవర్ల లో నే 43 రన్స్ సమర్పించుకున్నాడు.