Rajasthan Royals management: వచ్చే సీజన్ కు సంబంధించి ఐపీఎల్ ఇంకా ప్రారంభం కాకముందే సంచలనం చోటుచేసుకుంది. క్రికెట్ వర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపడే సంఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ వైవిధ్య భరితమైన జట్టుగా పేరుపొందిన రాజస్థాన్ రాయల్స్ లో భారీ కుదుపు ఏర్పడింది. అయితే ఇది ఎక్కడికి దారితీస్తుందో అనుకుంటుండగానే.. ఊహించిన విషయం వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రాజస్థాన్ జట్టు సారథి సంజు శాంసన్ వైదొలిగే అవకాశం కనిపిస్తోంది. ప్రఖ్యాత ESPN Cricinfo నివేదిక ప్రకారం సంజు త్వరలో రాజస్థాన్ జట్టును వీడిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: ‘వార్ 2’ క్లైమాక్స్ సీన్ తర్వాత ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్!
గత సీజన్లో సంజు కొన్ని మ్యాచ్లకు మాత్రమే రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత గాయం పేరుతో అతడు రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. వాస్తవానికి సంజీవ ఆధ్వర్యంలో 2024 సీజన్లో రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. ఏకంగా ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. సంజు ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు ఈ ఏడాది అద్భుతాలు సాధిస్తుందని. అన్ని అనుకున్నట్టు జరిగితే రాజస్థాన్ టైటిల్ సాధించే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ జట్టు గొప్ప గొప్ప విజయాలు సాధిస్తుందని అంచనాలు నెలకొన్నాయి. కానీ అనూహ్యంగా రాజస్థాన్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. దీనికి తోడు రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో కొంతమంది ఆటగాళ్లు మాత్రమే తమ సత్తా చాటారు. మిగతా ఆటగాళ్లు అంచనాలను అందుకోలేకపోయారు. అయితే జట్టుకూర్పు విషయంలో సంజు కు మేనేజ్మెంట్ అంతగా ప్రయారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. అందువల్లే అతడు జట్టు మేనేజ్మెంట్ తో విభేదించినట్టు ప్రచారం అప్పట్లో ప్రచారం జరిగింది. ఫలితంగా అతడు గాయం పేరుతో రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు.
Read Also: ట్రంప్ – పుతిన్ మీటింగ్ షురూ! జరగబోయే పరిణామాలు ఏంటి ?
రాజస్థాన్ జట్టు మేనేజ్మెంట్ తో సంజు కు అంతకంతకు విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో తట్టుకోలేక బయటకు రావాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఈఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. అయితే రాజస్థాన్ మేనేజ్మెంట్ సంజు విషయాన్ని కోచ్ రాహుల్ ద్రావిడ్ కు అప్పగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల విషయంలో అంతగా కఠిన వైఖరిని అవలంబించే విధానం రాహుల్ ద్రావిడ్ కు ఉండదు. పైగా ఆటగాళ్లతో జట్టుకు సేవలు నూటికి నూరు శాతం ఎలా అందించుకోవాలో రాహుల్ ద్రావిడ్ కు తెలుసు. అందువల్లే సంజు వ్యవహారాన్ని రాహుల్ ద్రావిడ్ కు మేరేజ్మెంట్ అప్పగించినట్టు సమాచారం. సంజు నిర్ణయంతో రాహుల్ ద్రావిడ్ ఏకీభవిస్తాడా.. లేదా బుజ్జగించి జట్టులో కొనసాగించేలా చేస్తాడా అని చూడాల్సి ఉంది.. అయితే మేనేజ్మెంట్ రియాన్ పరాగ్ కు విపరీతమైన ప్రయారిటీ ఇవ్వడం వల్లే సంజు జట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.