War 2 Jr NTR Vs Hrithik Roshan: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు పెరగడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆసక్తికరమైన ప్రొమోషన్స్ జరగకపోవడం గమనార్హం. విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ పర్వాలేదు అనిపించింది కానీ, ‘వార్’ ప్రమోషనల్ కంటెంట్ తో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. ఉదాహరణకు ట్రైలర్ నే తీసుకోండి, వార్ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది, కానీ ‘వార్ 2’ ఎదో పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది కానీ, కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి చూడాలి అనేంత ఆసక్తిని మాత్రం క్రియేట్ చేయలేదు అనేది వాస్తవం. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద మాత్రమే అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ ఈవెంట్ తర్వాత హైప్ వస్తుందని అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఓకే ఆసక్తికరమైన విషయం బయటపడింది.
Also Read: ది ప్యారడైజ్’ నుండి నాని ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఈ ‘జడల్’ ఏంటయ్యా బాబు!
ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశం తర్వాత పోస్ట్ క్రెడిట్స్ పడుతుంది కదా, ఆ పోస్ట్ క్రెడిట్స్ తర్వాత మైండ్ పోగొట్టే సన్నివేశం ఒకటి ఉంటుందట. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మరియు అలియా భట్ కనిపిస్తారట. స్పై యూనివర్స్ లో రాబోయే తదుపరి చిత్రానికి సంబందించిన చిన్న గ్లింప్స్ వీడియో అట ఇది. గతం లో సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘టైగర్ 3’ మూవీ క్లైమాక్స్ లో కూడా ఇదే విధంగా ‘వార్ 2’ కి సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియో ని పెడుతారు. అలా ఈ సినిమాలో కూడా పెడతారని టాక్. మరి ఈ పోస్ట్ క్రెడిట్ సన్నివేశం లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ మీడియా నుండి ఈ సినిమాకు మంచి రిపోర్ట్స్ ఉన్నాయి.
Also Read: ఒక్క ప్రాంతం నుండి గంటకు 50 వేల టిక్కెట్లు..’కూలీ’ సునామీ మొదలైంది!
ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేవు కానీ, టాక్ వస్తే మాత్రం దుమ్ము లేపేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ ఏ సినిమాకు వెయ్యరు. ఒకవేళ వేసినా కూడా కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ మొదటి రోజు కౌంటర్ బుకింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటాయి. ఇక టాక్ వస్తే మాత్రం వసూళ్లు అక్కడ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి. హృతిక్ రోషన్ గత చిత్రం ‘ఫైటర్ ‘ కి మొదటి రోజు బిలో యావరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 8 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చింది. ‘వార్ 2’ కి టాక్ వస్తే కచ్చితంగా పది మిలియన్ డాలర్ల గ్రాస్ ని కేవలం హిందీ వెర్షన్ నుండి రాబడుతుంది అనుకోవచ్చు.