PBKS Vs KKR IPL 2025:200కు మించి పరుగులు చేసినా.. గెలిచే పరిస్థితులు ప్రస్తుతం ఐపిఎల్ లో లేవు. ఎందుకంటే పిచ్ లను బ్యాటర్లకు అనుకూలంగా రూపొందించడం వల్ల దంచి కొడుతున్నారు.. బౌలర్లపై ఏమాత్రం కనికరం చూపకుండా దూకుడు చూపిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో నిండా 120 పరుగులు చేయకున్నా.. గెలవచ్చని నిరూపించింది పంజాబ్ జట్టు. ముల్లాన్ పూర్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో బలమైన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ను మట్టికరిపించింది.. 95 పరుగులకే ముగించింది. యజువేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించడంతో.. పంజాబ్ జట్టు 16 పరుగుల తేడాతో జయ కేతనం ఎగరవేసింది. అయితే ఐపీఎల్లో తక్కువ స్కోరు చేసినప్పటికీ గెలిచిన జట్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read: అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది.. పంజాబ్ గెలిచింది..
2025 ముల్లాన్ పూర్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 11 పరుగులకు ఆలౌట్ అయింది.. 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
డర్బన్ వేదికగా 2009లో చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని చెన్నై కాపాడుకుంది.
2018లో వాంఖడే స్టేడియంలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 118 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై జట్టును ఓడించి విజయం సాధించింది.
2009లో డర్బన్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టును ఓడించింది.
2013లో పూణే వేదికగా పూణే వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ తర్వాత అ టార్గెట్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కాపాడుకుంది.
రెండు జట్లు ఆల్ అవుట్ అయిన సందర్భాలు ఇవే
కోల్ కతా నైట్ రైడర్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా, 2017 లో తల పడినప్పుడు.. రెండు జట్లు ఆల్ అవుట్ అయ్యాయి. రెండు జట్లు 180 పరుగులు మాత్రమే చేయగలిగాయి.
ముంబై ఇండియన్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ముంబై వాంఖడే స్టేడియంలో 2018 లో తలపడ్డాయి.. ఈరెండు జట్లు కలిసి 205 పరుగులు చేశాయి.
2025లో ముల్లాన్ పూర్ వేదికగా పంజాబ్, కోల్ కతా జట్టు తలపడి.. రెండు జట్లూ 206 పరుగులు మాత్రమే చేయగలిగాయి.
2024లో వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. రెండు జట్లు 314 పరుగులు మాత్రమే చేయగలిగాయి..
2010లో నాగ్ పూర్ వేదికగా దక్కన్ చార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. రెండు జట్లు కూడా 316 పరుగులు మాత్రమే చేయగలిగాయి.
Also Read: చాహల్ నాలుగు వికెట్లు తీసిన వేళ.. ఆర్జే మహ్వేష్ ఇన్ స్టా స్టేటస్ లో ఏం పోస్ట్ చేసిందంటే..