Jr NTR : నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోల్లో ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…గత పది సంవత్సరాల నుంచి వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించిన హీరో కూడా తనే కావడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్ (Prshanth Neel) డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఇండియాలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. గత సంవత్సరం దేవర (Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడంలో మాత్రం కొంతవరకు వెనకబడిపోయాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు మాత్రం అలాంటి తప్పేమి చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఎంచుకొని భారీ విజయాన్ని అందుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా సన్నబడ్డాడు. క్యారెక్టరైజేషన్ లో వేరియేషన్స్ చూపించడానికి ఆయన స్వతహాగా డైట్ చేసి మరి సన్నబడ్డాడు. దాంతో అతని అభిమానులు కొంతవరకు కలవరపడుతున్నారు. నిజానికి ‘త్రిబుల్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ చాలా దృఢంగా ఉంటాడు. అలాంటి ఒక ఎన్టీఆర్ ని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : ఎన్టీఆర్ ధరించిన ఈ చొక్కా ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!
కానీ ఆయన మాత్రం చాలా సన్నబడిపోయి అసలు నిలబడడానికి కూడా ఓపిక లేనట్టుగా ఉన్నాడు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి ఈమధ్య ఎన్టీఆర్ ఎక్కువగా ఈవెంట్స్ కి హాజరవుతున్నాడు. తద్వారా ఆయనను చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో కనిపించే ఆ క్యారెక్టర్ పూర్తయిన తర్వాత అదే సినిమాలో మరో క్యారెక్టర్ ని పోషించి అందరిని ఆనందింప చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీదనే భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇక తొందర్లోనే ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ కి ఫ్లాప్ సినిమా అయితే రాలేదు.
కేజీఎఫ్ సిరీస్ తో పాటు సలార్ సినిమాతో వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. అతన్ని మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఎన్టీఆర్ కి మాత్రం భారీ విజయాన్ని కట్టబెడతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : జూ.ఎన్టీఆర్ సినిమాల్ని చూసి నటులుగా మారిన స్టార్ హీరోలు వీళ్లేనా..?