PBKS Vs KKR IPL 2025: 112 పరుగుల టార్గెట్ మొదలుపెట్టిన కోల్ కతా జస్ట్ ఏడు పరుగులకే ఓపెనర్లు సునీల్ నరైన్(5), క్వింటన్ డికాక్ జాన్సన్, బార్ట్ లెట్ బౌలింగ్ లో ఔటయ్యారు. ఇది ఒక రకంగా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. రఘు వంశీ (37), రహానే (17) మూడో వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విజయం వైపుగా కోల్ కతా ను నడిపించడం మొదలుపెట్టారు.. ఇక ఇక్కడే యజువేంద్ర చాహల్ ఎంట్రీ ఇచ్చాడు.. సాలిడ్ పెర్ఫార్మన్స్ చూపించాడు. దీంతో కోల్ కతా డిఫెన్స్ లో పడింది. ముఖ్యంగా 12 ఓవర్లో వెంట వెంటనే రెండు వికెట్లు తీయడం ఒక్కసారి గా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది.. రమణ్ దీప్ సింగ్, రింకూ సింగ్ ను వరుస బంతుల్లో అవుట్ చేయడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ దశలో రస్సెల్(17) కాస్త కంగారు పెట్టినప్పటికీ జాన్సన్ బౌలింగ్లో.. అతడు అవుట్ కావడంతో కోల్ “కథ” ముగిసింది.
Also Read: నరాలు కట్ అయ్యాయి.. ఏమన్నా మ్యాచ్ నా..”పంజా” బ్ దెబ్బకు కోల్ “కథ” ముగిసింది
వారిద్దరి వికెట్లు కూడా
రమణ్ దీప్ సింగ్, రింకు సింగ్ మాత్రమే కాదు, సునీల్ నరైన్, రఘువంశీ వికెట్లను కూడా చాహల్ తీశాడు. ఆ తర్వాత అదే ఊపులో రమణ్ దీప్ సింగ్, రింకు సింగ్ వెనక్కి పంపించాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోవైపు జాన్సన్ సునీల్ న రైన్, రస్సెల్, హర్షిత్ రాణా వంటి వారి వికెట్లను పడగొట్టడం.. క్వింటన్ డికాక్, వెంకటేష్ అయ్యర్, వైభవ్ ఆరో రాను బార్ట్ లెట్, మాక్స్ వెల్, అర్ష్ దీప్ సింగ్ అవుట్ చేయడంతో.. కోల్ కతా నైట్ రైడర్స్15.1 ఓవర్లలో 95 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. వాస్తవానికి 111 పరుగుల స్కోరు ను కాపాడుకొని అసలు సిసలైన పోటీ తత్వాన్ని పంజాబ్ జట్టు ప్రదర్శించింది. అంతేకాదు పాయింట్లు పట్టికలో ఏకంగా నాలుగో స్థానానికి ఎదిగింది. మంగళవారం మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆరో స్థానానికి దిగజారింది.. పంజాబ్ జట్టు ఇదే స్ఫూర్తి కొనసాగిస్తే ప్లే ఆఫ్ వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వాస్తవానికి ఐపీఎల్లో 200 దాటి పరుగులు నమోదు అవుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో పంజాబ్ జట్టు సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది అని చెప్పవచ్చు. ఎందుకంటే భయంకరమైన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్లను వెంట వెంటనే అవుట్ చేయడం.. 111 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అంటే మాటలు కాదు..
Also Read: చాహల్ నాలుగు వికెట్లు తీసిన వేళ.. ఆర్జే మహ్వేష్ ఇన్ స్టా స్టేటస్ లో ఏం పోస్ట్ చేసిందంటే..