PBKS Vs KKR IPL 2025: చాహల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.. మెలితిప్పే బంతులు వేశాడు.. తన స్పిన్ మాయజాలంతో ఓడిపోవాల్సిన మ్యాచ్ ను గెలిపించాడు. పంజాబ్ జట్టుకు తిరుగులేని బూస్ట్ ఇచ్చాడు. చాహల్ తీసింది అల్లాటప్పా వికెట్లు కావు.. ఒక్కొక్కడు మ్యాచ్ విన్నర్లే.. గతంలో వారు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును గెలిపించిన వారే. రహానే, సూర్యవంశీ, రమణ్ దీప్ సింగ్, రింకూ సింగ్ లాంటి ప్లేయర్లను వెనక్కి పంపించాడంటే.. చాహల్ ఏ స్థాయిలో బౌలింగ్ వేసాడో అర్థం చేసుకోవచ్చు.. అంతేకాదు నాలుగు ఓవర్లు వేసి.. 28 పరుగులు ఇచ్చాడు.. మొత్తంగా ఐపీఎల్లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. చాహల్ సూపర్ బౌలింగ్ కు జాన్సన్ కూడా తోడయ్యాడు. దీంతో వీరిద్దరూ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కథను ముగించారు.. సొంత మైదానంలో స్వల్ప స్కోర్ చేసినప్పటికీ..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. వీరిద్దరే ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు.
Also Read: శ్రేయస్ అయ్యర్ ను షారుక్ ఎందుకు వదిలేశాడో.. ప్రీతి జింటాకు తెలిసే ఉంటుంది..
అద్భుతమైన ప్రతిభ ఉంది
చాహల్ నాలుగు వికెట్లు తీసిన నేపథ్యంలో.. అతనితో సన్నిహితంగా ఉంటున్న ఆర్జే మహ్వేష్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది.. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టేటస్ పెట్టింది. అందులో చాహల్, తను ఇటీవల కాలంలో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది. అందులో వాటే టాలెంటెడ్ మాన్.. హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపిఎల్.. ఫర్ ఏ రీజన్.. అసంభవ్ అంటూ దానికి క్యాప్షన్ జత చేసింది. చాహల్ తన భార్య ధనశ్రీ విడాకులు తీసుకున్న తర్వాత ఆర్జే మహ్వేష్ తో సన్నిహితంగా ఉంటున్నాడు.. వీరిద్దరూ ఇటీవల టీమిండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను చూసేందుకు దుబాయ్ వెళ్లారు. అక్కడే వీరు మీడియా దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యవహార శైలి నెటిజన్ల అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ఉంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని కన్ఫామ్ చేసుకున్నారు. అంతేకాదు ఇటీవల చాహల్ ను ఉద్దేశించి ఆర్జే మహ్వేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దానికి చాహల్ కూడా ఎమోషన్ అయ్యాడు.. మీరు చూపిస్తున్న ఇంతటి ఇష్టానికి ధన్యవాదాలు అన్నట్టుగా అతడు కామెంట్ చేశాడు. మొత్తానికి కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై నాలుగు వికెట్లు తీయడం ద్వారా.. చాహల్ మరోసారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇదే సమయంలో ఆర్జే మహ్వేష్ చాహల్ మీద తనకున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసింది.
Also Read: నరాలు కట్ అయ్యాయి.. ఏమన్నా మ్యాచ్ నా..”పంజా” బ్ దెబ్బకు కోల్ “కథ” ముగిసింది
RJ MAHVASH INSTA STORY FOR YUZI CHAHAL #yuzichahal #RJMahvash #PBKSvKKR pic.twitter.com/UiCXRjJrgP
— Sachin sharma (Sports and political journalist) (@72Sachin_sharma) April 15, 2025