క్రీడలుMohammed Shami: వికెట్ల మీద వికెట్లు పడగొట్టి.. షమీ సంకేతాలిచ్చాడు.. ఆస్ట్రేలియా బెర్త్ గంభీర్, రోహిత్...

Mohammed Shami: వికెట్ల మీద వికెట్లు పడగొట్టి.. షమీ సంకేతాలిచ్చాడు.. ఆస్ట్రేలియా బెర్త్ గంభీర్, రోహిత్ చేతిలోనే

Mohammed Shami: 54 పరుగులు ఇచ్చి నాలుగో వికెట్లు పడగొట్టి.. బెంగాల్ జట్టుకు తిరుగులేని లీడ్ అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో బెంగాల్ జట్టు కాలర్ ఎగరేసేలా చేశాడు. బుధవారం 10 ఓవర్లు వేసిన షమీ.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ రెండవ రోజు గురువారం మాత్రం ఆకాశమేహద్దుగా రెచ్చిపోయాడు. తొమ్మిది ఓవర్లు వేసి, 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.. శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ రిహాబిలిటేషన్ సెంటర్లో షమీ చికిత్స పొందాడు. ఆ తర్వాత రంజీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సత్తా చూపించి.. జాతీయ జట్టుకు ఎంపిక అవుతానని షమీ ప్రకటించాడు. అతడు చెప్పినట్టుగానే రంజీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ తన ప్రతిభ ఏమిటో బీసీసీఐ సెలెక్టర్లకు అర్థమయ్యేలా చేస్తున్నాడు.

భారత బౌలింగ్ బలపడుతుంది

ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్ లో భారత్ బౌలింగ్ లో లోపాలు కనిపించాయి. అయితే ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా వెళ్ళింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే షమీ టీమిండియాలో చేరితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా మైదానాలు బౌన్సీగా ఉంటాయి. అలాంటి చోట షమీ అద్భుతంగా రాణిస్తాడని… అభిమానులు చెబుతున్నారు.. పెర్త్ టెస్ట్ నాటికి షమీ కనక తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటే.. అతడిని జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.. ఒకవేళ తొలి టెస్ట్ నాటికి కాకపోయినా.. రెండవ టెస్టు సమయానికైనా అతడిని జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇక తన పునరాగమనంలో నాలుగు వికెట్లు పడగొట్టిన షమీ.. ఐపీఎల్ లో గుజరాత్ జట్టు తరఫున కూడా తాను ఆడతానని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక గత ఐపిఎల్ లో షమీ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.. ఇక రంజి మ్యాచ్ విషయానికి వస్తే 103/1స్కోర్ తో మధ్యప్రదేశ్ జట్టు రెండవ రోజు ఆట మొదలుపెట్టింది. అయితే ఆ జట్టుకు బెంగాల్ బౌలర్లు సినిమా చూపించారు. సూరజ్ (2/35) దూకుడు కొనసాగించడంతో శుభ్రన్షు(47), రజత్ పాటిదార్(41) అవుట్ కాక తప్పలేదు. ఆ తర్వాత సెమీ ఎంట్రీ ఇచ్చాడు.. మధ్యప్రదేశ్ కెప్టెన్ శుభం శర్మను క్లీన్ బోల్డ్ చేశాడు. చివరి ముగ్గురు ఆటగాళ్ళను కూడా వెనక్కి పంపించి .. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ ను ముగించాడు..షమీ, సూరజ్ మాత్రమే కాకుండా మహమ్మద్ కైఫ్ 2/41, రోహిత్ కుమార్ 1/27 అదరగొట్టారు. మధ్యప్రదేశ్ 167 పరుగులకే తన ఇన్నింగ్స్ ముగించింది. బెంగాల్ జట్టు 228 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Smaran Ravichandran: SRH నుంచి మరో రేసుగుర్రం.. ఎవరీ స్మరణ్ రవిచంద్రన్.. ఎక్కడతను..

Smaran Ravichandran: ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు దూసుకుపోతోంది. వరుస విజయాలతో దాదాపు ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది. ఇకపై జరిగే మ్యాచ్ లలో హైదరాబాద్ గనుక విజయాలు సాధిస్తే...

Mohammed Shami: మేనేజ్మెంట్ పట్టించుకోకపోతేనేం.. షమీ అదరగొడుతున్నాడు.. ఈసారైనా చోటు దక్కుతుందా?

Mohammed Shami: 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఆవిర్భవించాడు. ఆ తర్వాత అతడు గాయపడ్డాడు. పాదానికి...

Most Popular

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్...

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా...

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం...
Exit mobile version