https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశులపై కార్తీక పౌర్ణమి ప్రభావం.. వ్యాపారులకు అనుకోని ధన లాభం..

విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఈరోజు వ్యాపారులు కొత్త వ్యక్తులను కలుస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : November 15, 2024 / 07:30 AM IST

    Horoscope Today(2)

    Follow us on

    Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉండనుంది ఇదే రోజు కార్తీక పౌర్ణమి కావడంతో కొన్ని రాశుల వారికి మెరుగైన ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వ్యాపారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు వేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    వృషభరాశి:
    ఇంట్లో అశాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బు రాకపోవడంతో తీవ్ర నిరాశతో ఉంటారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    మిథున రాశి:
    విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఈరోజు వ్యాపారులు కొత్త వ్యక్తులను కలుస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

    కర్కాటక రాశి:
    ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి. కొన్ని పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. దీంతో అవి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయి.

    సింహా రాశి:
    వ్యాపారులపై శత్రువుల ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. సాయంత్రం ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

    కన్యరాశి:
    వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. మిగిలిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త పనిని ప్రారంభిస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడుతారు.

    తుల రాశి:
    ఈ రాశి వ్యాపారులకు అనుకోని అదృష్టం ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులు మానసికంగా ఒత్తిడితో కలిగి ఉంటారు. ఇంట్లోకి బంధువుల రాకతో సందడిగా ఉంటుంది. కొందరు వ్యక్తుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    చుట్టూ ఉన్న వ్యక్తులతో ఇబ్బందులు పడుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదనపు ఖర్చులు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త పనిని ప్రారంభించేముందు ఇతరుల సలహా తీసుకోవాలి.

    ధనస్సు రాశి:
    ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు చేపట్టిన పనులు ఆగిపోతాయి. వ్యాపారులు ఇప్పటికే చేసుకున్న కొన్ని ఒప్పందాలు రద్దు కావొచ్చు.

    మకర రాశి:
    ఈ రాశిఉద్యోగులకు ఈరోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మాటలను అదుపులో ఉంచుకోకపోతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు.

    కుంభ రాశి:
    ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకోకుండా ధన లాభం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    మీనరాశి:
    ఈ రాశి వారు ఈరోజు అసంతృప్తితో ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటంబంలో కొన్ని గొడవలు ఉండే అవకాశం. ఉద్యోగులు ప్రతికూల ఫలితాలు పొందుతారు.