Homeక్రీడలుLamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.....

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కహాని ఏంటో తెలుసా..

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా నిలవడంలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్థిరమైన ప్రదర్శన చేసి సత్తా చూపించాడు. మైదానంలో పాదరసం లాగా కదులుతూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.

ఈ ఆటగాడు మరెవరో కాదు లామినే యామల్. అతడికి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే స్పెయిన్ జాతీయ జట్టలోకి వచ్చాడు. ఫుట్బాల్ క్రీడలో ఇచ్చే అత్యున్నత అవార్డులను అందుకున్నాడు. అంతేకాదు తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అందువల్లే స్పెయిన్ జట్టులో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడి నైపుణ్యానికి యావత్ ఫుట్బాల్ ప్రపంచమే ఫిదా అయిపోయింది. ఇతడికి నచ్చే ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కాకపోతే ఎటాకింగ్ లో మెస్సిని అనుసరిస్తాడు. మారడోనా స్టైల్ కూడా ఫాలో అవుతూ ఉంటాడు.

ఈసారి జరిగిన ఫిఫా ప్రపంచ సమరంలో స్పెయిన్ జట్టులో మెరుపుతీగ లాగా కనిపించాడు. బంతిని పాస్ చేయడంలో.. బంతిని డిఫెన్స్ చేయడంలో ప్రత్యర్థులకు అందనంత స్థాయిలో నిలిచాడు. అందువల్లే స్పెయిన్ జట్టు ఇతడి మీద భారీగా నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని ఇతడు వమ్ము చేయలేదు. ఫైనల్ మ్యాచ్లో గోల్ చేయలేకపోయినప్పటికీ.. అర్జెంటినా జట్టు మీద స్పెయిన్ చాలాసార్లు దాడి చేసింది. గోల్ పోస్టులోకి బంతిని పంపించడానికి పదేపదే ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ఎక్కువ చేసింది ముమ్మాటికి యామల్.

యామల్ కు ఒక లవ్ స్టోరీ కూడా ఉంది. ఇతడు గార్సియా అనే అమ్మాయితో పీకలలోతు ప్రేమలో ఉన్నాడు. ఇతడు ఆడే ప్రతి మ్యాచ్ కు గార్సియా హాజరయ్యేది. అతడిని ప్రోత్సహించేది. అతడు ఆడుతుంటే ఆనందంతో ఎగిరి గంతులు వేసేది. తన చిరకాల వాంఛ అయిన ఫిఫా కప్ సాధించిన నేపథ్యంలో యామల్ గార్సియాకు మెర్సిడేజ్ బెంజ్ కారు కొని ఇచ్చాడు . అంతేకాదు ఆ కారులో ప్రియురాలిని కూర్చోబెట్టుకొని.. ఆమె సాంగత్యాన్ని ఆస్వాదించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. 19 సంవత్సరాల వయసులోనే ఫుట్బాల్ క్రీడలో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్న యామల్.. గర్ల్ ఫ్రెండ్ కు కోట్లు విలువచేసే కారు కొనిచ్చి.. తన స్థాయి ఏమిటో నిరూపించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version