https://oktelugu.com/

Mohammed Shami: వికెట్ల మీద వికెట్లు పడగొట్టి.. షమీ సంకేతాలిచ్చాడు.. ఆస్ట్రేలియా బెర్త్ గంభీర్, రోహిత్ చేతిలోనే

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మైదానంలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుత సీజన్లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో అతడు బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తన విశ్వరూపం చూపించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 15, 2024 / 07:40 AM IST

    Mohammed Shami(1)

    Follow us on

    Mohammed Shami: 54 పరుగులు ఇచ్చి నాలుగో వికెట్లు పడగొట్టి.. బెంగాల్ జట్టుకు తిరుగులేని లీడ్ అందించాడు. తొలి ఇన్నింగ్స్ లో బెంగాల్ జట్టు కాలర్ ఎగరేసేలా చేశాడు. బుధవారం 10 ఓవర్లు వేసిన షమీ.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ రెండవ రోజు గురువారం మాత్రం ఆకాశమేహద్దుగా రెచ్చిపోయాడు. తొమ్మిది ఓవర్లు వేసి, 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లను పడగొట్టాడు.. శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ రిహాబిలిటేషన్ సెంటర్లో షమీ చికిత్స పొందాడు. ఆ తర్వాత రంజీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సత్తా చూపించి.. జాతీయ జట్టుకు ఎంపిక అవుతానని షమీ ప్రకటించాడు. అతడు చెప్పినట్టుగానే రంజీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ తన ప్రతిభ ఏమిటో బీసీసీఐ సెలెక్టర్లకు అర్థమయ్యేలా చేస్తున్నాడు.

    భారత బౌలింగ్ బలపడుతుంది

    ఇటీవలి న్యూజిలాండ్ సిరీస్ లో భారత్ బౌలింగ్ లో లోపాలు కనిపించాయి. అయితే ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా వెళ్ళింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే షమీ టీమిండియాలో చేరితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా మైదానాలు బౌన్సీగా ఉంటాయి. అలాంటి చోట షమీ అద్భుతంగా రాణిస్తాడని… అభిమానులు చెబుతున్నారు.. పెర్త్ టెస్ట్ నాటికి షమీ కనక తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటే.. అతడిని జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.. ఒకవేళ తొలి టెస్ట్ నాటికి కాకపోయినా.. రెండవ టెస్టు సమయానికైనా అతడిని జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇక తన పునరాగమనంలో నాలుగు వికెట్లు పడగొట్టిన షమీ.. ఐపీఎల్ లో గుజరాత్ జట్టు తరఫున కూడా తాను ఆడతానని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక గత ఐపిఎల్ లో షమీ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డు సృష్టించాడు.. ఇక రంజి మ్యాచ్ విషయానికి వస్తే 103/1స్కోర్ తో మధ్యప్రదేశ్ జట్టు రెండవ రోజు ఆట మొదలుపెట్టింది. అయితే ఆ జట్టుకు బెంగాల్ బౌలర్లు సినిమా చూపించారు. సూరజ్ (2/35) దూకుడు కొనసాగించడంతో శుభ్రన్షు(47), రజత్ పాటిదార్(41) అవుట్ కాక తప్పలేదు. ఆ తర్వాత సెమీ ఎంట్రీ ఇచ్చాడు.. మధ్యప్రదేశ్ కెప్టెన్ శుభం శర్మను క్లీన్ బోల్డ్ చేశాడు. చివరి ముగ్గురు ఆటగాళ్ళను కూడా వెనక్కి పంపించి .. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ ను ముగించాడు..షమీ, సూరజ్ మాత్రమే కాకుండా మహమ్మద్ కైఫ్ 2/41, రోహిత్ కుమార్ 1/27 అదరగొట్టారు. మధ్యప్రదేశ్ 167 పరుగులకే తన ఇన్నింగ్స్ ముగించింది. బెంగాల్ జట్టు 228 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది.