Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: గంభీర్ మాట్లాడుతున్నా.. పట్టించుకోని రోహిత్.. వైరల్ వీడియో

Rohit Sharma: ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ ని కూడా టీమిండియా కోల్పోయింది. సిరీస్ భవితవ్యాన్ని తెలిసే మూడో మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది. కేవలం 360 పరుగులకే పరిమితమైనది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. కెప్టెన్ గిల్.. మరో ఆటగాడు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే కీలక దశలో వీళ్ళు అవుట్ కావడం.. మిగతా ప్లేయర్లు అంత గొప్పగా ఆడలేక పోవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.

కేఎల్ రాహుల్.. శ్రేయస్ అయ్యర్.. అక్షర్ పటేల్ వంటి వారు చేతులెత్తేశారు. దీంతో గెలుపు దశలో ఉన్న ఇండియా ఒక్కసారిగా తడబాటుకు గురైంది. అప్పటిదాకా ఇంగ్లాండ్ జట్టుకు మించిన పరుగులు చేస్తూ గెలుపు మీద ఆశలు పెంచుకున్న అభిమానులు.. ఆటగాళ్లు వరుసగా అవుట్ కావడంతో తీవ్రంగా నిరాశపడ్డారు. ఈ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పనికిమాలిన ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించి పరువు తీస్తున్నారని అభిమానులు గౌతమ్ గంభీర్ మీద మండిపడుతున్నారు. బౌలింగ్ సరిగ్గా లేదని.. మిడిల్ ఆర్డర్ సరిగా బ్యాటింగ్ చేయడం లేదని.. టెయిల్ ఎండర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి సమయంలో టీమిండియా ఎలా గెలుస్తుందని అభిమానులు వాపోతున్నారు.

మరోవైపు రోహిత్ శర్మ మీద గౌతమ్ గంభీర్ కావాలని నెగిటివ్ స్పెక్యులేషన్ చేస్తున్నారని అతడి అభిమానులు సోషల్ మీడియాలో కొంతకాలంగా వాపోతూనే ఉన్నారు. మరోవైపు టెస్ట్ ఫార్మాట్ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. వన్డే ఫార్మాట్లో కెప్టెన్ గా వైదొలిగాడు. త్వరలో అతన్ని వన్డే జట్టు నుంచి కూడా తప్పిస్తారని వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే వాటిని మేనేజ్మెంట్ కొట్టి పారేసింది. తన మీద వస్తున్న రిటైర్మెంట్ వార్తలకు రోహిత్ సెంచరీతో సమాధానం చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టు మీద అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. తను ఔట్ అయ్యి వచ్చిన తర్వాత రోహిత్ లార్డ్స్ మైదానంలో పై లాంజ్ లో కూర్చున్నాడు. పక్కనే గౌతమ్ గంభీర్ కూడా ఉన్నాడు.. గౌతమ్ గంభీర్ అదే పనిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. రోహిత్ పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను అతని అభిమానులు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ కు ఇది జరగాల్సిందేనని.. రోహిత్ శర్మ కెరీర్ తో ఆడుకున్నాడని అతని అభిమానులు మండిపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version