Mohammed Shami: 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా తరఫున హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఆవిర్భవించాడు. ఆ తర్వాత అతడు గాయపడ్డాడు. పాదానికి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి లండన్ వెళ్ళాడు. శస్త్ర చికిత్స అనంతరం.. అతడికి జట్టులో అవకాశం లభించడం లేదు. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడినప్పటికీ.. అతడు తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు.
షమీ లో అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపిస్తున్నప్పటికీ.. అతడికి అవకాశాలు లభించడం లేదు. దీనికి తోడు అతడి వ్యక్తిగత జీవితం కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఇటీవల ఆయన మాజీ భార్య భారీగా భరణం కావాలని కోర్టులో కేసు కూడా వేసింది. ఆ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతూనే ఉంది. వ్యక్తిగత జీవితం ఇలా ఉంటే.. క్రీడా జీవితం మరో విధంగా ఉంది.. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. సత్తా చూపించే సామర్థ్యం ఉన్నప్పటికీ షమీ కి జట్టులో అవకాశాలు రావడం లేదు. దీంతో అతడి ప్రతిభ అడవి కాచిన వెన్నెల మాదిరిగా మారిపోతోంది.
డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తేనే ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామని మేనేజ్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. మహమ్మద్ షమీ రంజి క్రికెట్ ఆడుతున్నాడు. జమ్ము కాశ్మీర్ లో జరుగుతున్న రంజి క్రికెట్లో.. అతడు సత్తా చూపిస్తున్నాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో బెంగాల్ జట్టు తరుపున అతడు ఒకటే ఇన్నింగ్స్ లో ఎనిమిది టికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.
కొంతకాలంగా డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపిస్తున్నాడు షమీ. జాతీయ జట్టులో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని అతడు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు ఇదే మ్యాచ్లో జమ్మూ కాశ్మీర్ బౌలర్ అకీబ్ నబీ సైతం ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు నబి 14 ఇన్నింగ్స్లలో 46 వికెట్లు సాధించాడు. శమీ భీకరమైన ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని.. నబీకి కూడా ఇండియన్ స్క్వాడ్ లో చోటు కల్పించాలని అభిమానులు కోరుతున్నారు.
డొమెస్టిక్ క్రికెట్లో ఇషాన్ కిషన్ సత్తా చూపించాడు. అతడిని జాతీయ జట్టులోకి మేనేజ్మెంట్ తీసుకుంది. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా తన ఏమిటో నిరూపించుకున్నాడు ఇషాన్. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. షమీ కి కూడా అలానే అవకాశం ఇస్తే తాను ఏమిటో మరోసారి నిరూపించుకుంటాడని ఇండియన్ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.