MBBS : పై ఉపోద్ఘాతం చదివి.. అతడేదో అనువంశిక వైద్యుడు కాదు. ఆయుర్వేదాన్ని అవపోసన పట్టిన వ్యక్తి కాదు. ఒక రకంగా చెప్పాలంటే అతడికి వైద్యానికి పెద్దగా సంబంధం లేదు. పైగా అతడు వైద్యుడు కూడా కాదు. అలాంటప్పుడు అతని వద్దకు పెద్ద పెద్ద క్రికెటర్లు ఎందుకు వస్తున్నారనే కదా మీ అనుమానం.. దాని నివృత్తి కోసం చదివేయండి ఈ కథనం.
Also Read : అది నోబాల్ ఎలా అవుతుంది.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో కొన్ని మ్యాచ్ల నుంచి అంపైర్లు ఆటగాళ్ల బ్యాటర్లను తనిఖీ చేస్తున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నిబంధనలు పాటించకపోవడంతో ఇప్పటికే అంపైర్లు కీలక ఆదేశాలు జారీ చేశారు. సునీల్ నరైన్, అన్రిచ్ నోకియా, రమణ్ దీప్ సింగ్ బ్యాట్లను మార్చాలని స్పష్టం చేశారు. దీంతో వారు ఆల్టర్నేటివ్ బ్యాట్లతో బ్యాటింగ్ చేశారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో బ్యాట్ల పరిమాణం విషయంపై విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒక ‘బ్యాట్ డాక్టర్ “గురించి ఇష్టమైన చర్చ జరుగుతున్నది. ఆ వ్యక్తి ఐపీఎల్లో స్టార్ ఆటగాళ్ల బ్యాట్ లను రిపేర్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు అజిత్ కుమార్.. ఉండేది వెస్ట్ బెంగాల్ లోని హతి యారా ప్రాంతం.. అతడి వృత్తి బ్యాట్లను సర్వీస్ చేయడం. ” నాకు క్రికెట్ బ్యాట్లను సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. దానిని ఒక వ్యక్తిగా ఎంచుకున్నాను. క్రికెటర్లు తాము ఆడుతున్న బ్యాట్లలో ఏదైనా సమస్య వస్తే నా వద్దకు పంపిస్తుటారు. రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రానా, రమణ్ దీప్ సింగ్, సాల్ట్, మనీష్ పాండే, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, జో రూట్, బెన్ స్టోక్స్, రసెల్ ఇటువంటి వాళ్ళు వారి బ్యాట్లను నా వద్దకు తీసుకొచ్చారు. అయితే రిపేర్ చేసినందుకు గాను ఒక్కో బ్యాట్ పై 800 నుంచి 1000 ఛార్జ్ గా తీసుకుంటాను. ఇటీవల సునీల్ నరైన్ బ్యాట్ వెడల్పుతో పెద్దగా సమస్య రాలేదు. కాకపోతే అతని హ్యాండిల్ లో కాస్త తేడా కనిపించింది. అయితే గొప్ప గొప్ప ఆటగాళ్లు నా వద్దకు రారు. లేని వారి వద్దకు వెళ్తాను. ఇక సాల్ట్ ఆడుతుంటే బ్యాట్ విరిగింది. దానిని నేనే బాగు చేశాను. ఇంకా చాలామంది క్రికెటర్ల బ్యాట్లు కూడా తానే మరమ్మతులు చేశానని” అజిత్ కుమార్ శర్మ పేర్కొన్నాడు. అయితే ఈ కథనాన్ని ఓ న్యూస్ పబ్లిష్ చేసే వెబ్ సైట్లో చూసి రాశాం. అది వెస్ట్ బెంగాల్ కు చెందిన బెంగాలీ న్యూస్ వెబ్సైట్. అందులో ఉన్న సమాచారాన్ని ఇక్కడ అందించాం. ఈ విషయాన్ని రీడర్స్ గమనించాలి.
Also Read : హెడ్ భయ్యా.. ఆడటం ఇష్టం లేకపోతే కావ్య పాపకు చెప్పి తప్పుకోవచ్చుగా!