Mi Vs SRH IPL 2025: ప్రస్తుతం ఐపీఎల్ లో సంచలన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందులో గురువారం నాటి ముంబై – హైదరాబాద్ మ్యాచ్లో కూడా సంచలన సంఘటన చోటుచేసుకుంది.. ఓ అనూహ్యమైన నో బాల్ వెలుగులోకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో హైదరాబాద్ బౌలర్ అన్సారి బంతివేయగా.. దానిని ముంబై ఆటగాడు రికెల్టన్ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతి గాల్లో లేవడంతో కెప్టెన్ కమిన్స్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో రెండో వికెట్ పడిందని హైదరాబాద్ ఆటగాళ్లు సంబరాలు జరుపుకున్నారు. కానీ రికెల్టన్ అవుట్ కాలేదు. పైగా అంపైర్ నాట్ అవుటని పేర్కొన్నాడు.. దీనికి నోబాల్ కారణమని అతడు వెల్లడించాడు.
Also Read: హెడ్ భయ్యా.. ఆడటం ఇష్టం లేకపోతే కావ్య పాపకు చెప్పి తప్పుకోవచ్చుగా!
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే
రికెల్టన్ ను నాట్ అవుట్ అని అంపైర్ ప్రకటించడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అంతేకాదు ఆ బంతిని నోబాల్ అని వెల్లడించడం మైదానంలో మ్యాచ్ చూస్తున్న హైదరాబాద్ ప్రేక్షకులకు విస్మయాన్ని కలిగించింది. అయితే ఇది నోబాల్ ఎలా అవుతుందనేది చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఐసీసీ నిబంధన ప్రకారం బ్యాట్ ను బంతి తాకక ముందు కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకు రావద్దు. అలా వస్తే ఆ బంతిని నో బాల్ అని ప్రకటిస్తారు. ఇక ముంబై ఇన్నింగ్స్ సమయంలో రికెల్టన్ బ్యాట్ తో బంతిని కొట్టకముందే కీపర్ గ్లవ్స్ స్టంప్ ల ముందుకు వచ్చాయి.. అంతే ఆ బంతిని గమనించిన థర్డ్ అంపైర్ రికెల్టన్ నాట్ అవుట్ అని ప్రకటించాడు.. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురికావడం హైదరాబాద్ ఆటగాళ్ల వంతయింది. అలా లభించిన జీవదానాన్ని రికెల్టన్ అద్భుతంగా వినియోగించుకున్నాడు. 23 బంతుల్లో ఐదు ఫోర్లు కొట్టి 31 పరుగులు చేశాడు. చివరికి హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవేళ రికెల్టన్ కనుక అవుట్ అయి ఉంటే మ్యాచ్ పై హైదరాబాద్ బౌలర్లకు పట్టు బిగించడానికి అవకాశం లభించేది. కానీ రికెల్టన్, జాక్స్ రెండో వికెట్ కు 37 పరుగులు జోడించడంతో ముంబై జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ నిర్దేశించిన 163 రన్స్ టార్గెట్ ను ఈజీగానే ముంబై జట్టు ఫినిష్ చేసింది. తద్వారా హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది. అయితే థర్డ్ ఎంపైర్ రికెల్టన్ ను నాట్ అవుట్ అని ప్రకటించడాన్ని ముంబై అభిమానులు స్వాగతిస్తుంటే.. హైదరాబాద్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. గతంలో విగ్నేష్ బౌలింగ్ వేస్తున్నప్పుడు.. ముంబై జట్టు కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ ముందుకు వచ్చాయని.. అప్పుడు థర్డ్ అంపైర్ ఏం చేశాడని.. గడ్డి ఏమైనా పీకుతున్నాడా అని మండిపడుతున్నారు.
Also Read: ముంబై జట్టు ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి అవుతున్న అభిమానులు..