‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శని, శుక్రుడు, రాహు, బుధుడు ,గురుడు, చంద్రుడు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈరోజు వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. మానసికంగా ఆందోళనగా ఉంటారు. నచ్చిన పనిని మాత్రమే చేయాలి. పచ్చని పనులకు దూరంగా ఉండటమే మంచిది. వ్యాపారులో శత్రువులపై కన్నేసి ఉంచాలి. ఉద్యోగుల లక్ష్యాలకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులతో వాగ్వాదం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల ఏ సమస్య ఉండదు. అనుకోకుండా వీరా యాత్రలకు వెళ్తారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు సమాజంలో గౌరవం పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారాల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వెంటనే వైద్యుడుని సంప్రదించాలి. పిల్లల ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండకూడదు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈరోజు వారికి ఈరోజు అన్నీ అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. సామాజిక సేవలో పాల్గొంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కొత్తగా ఆర్థిక లావాదేవీలు చేయాలని వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటారు. వ్యాపారులకు శత్రువులు హాని కలిగించే అవకాశం ఉంది. సొంతంగా వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కుటుంబంలో పాత విషయాలపై గొడవలు ఉంటాయి. ఈ క్రమంలో మాటలను అదుపులో ఉంచుకోవడమే మంచిది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే కొందరు నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యాన బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల సమయానికి వైద్యుడిని సంప్రదించడమే మంచిది. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఈ విషయంలో కాస్త సమస్యలను ఎదుర్కొంటారు. నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో సమయమున పాటించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అయితే పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఇష్టం లేని పనిలో జోలికి వెళ్ళకూడదు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. పెద్దల అండతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈరోజు వారికి ఈరోజు మానసికంగా ఆందోళన ఉంటుంది. ఉద్యోగులు అధికారులనుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. విదేశాల నుంచి విచారకరమైన వార్తలను వింటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. మానసికంగా ఒత్తిడితో కలిగి ఉంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . . ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. కొన్ని కారణాలవల్ల మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో ముఖ్యమైన విషయాన్ని చర్చిస్తారు. అయితే అనుకోకుండా వివాదం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి. మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు లాభాలను పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు అరుదైన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మానసికంగా ప్రశాంతంగా కనిపిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఈ రోజు శని దేవుడి అనుగ్రహం ఉండనుంది. నీతో భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.