spot_img
Homeక్రీడలుVirat Kohli- Babar Azam: బాబర్ అజమ్ కి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ...బాబర్ కి కోహ్లీ...

Virat Kohli- Babar Azam: బాబర్ అజమ్ కి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ…బాబర్ కి కోహ్లీ అంటే ఎందుకంత ఇష్టం…

Virat Kohli- Babar Azam: వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఇండియా పాకిస్తాన్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించడం జరిగింది. అయితే ఇండియన్ క్రికెటర్లలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న ఇండియన్ ప్లేయర్ గా చరిత్రలో నిలిచాడు. ఇండియా లో అనే కాదు విదేశాలలో కూడా ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. అలాగే విదేశీ ప్లేయర్లు కూడా ఆయనకు అభిమానులుగా ఉన్నారు. అలాంటి కోహ్లీ ప్రస్తుతం ఇండియన్ టీం లో కీలకమైన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. అత్యంత వేగంగా పరుగులు చేస్తూ రన్ మిషన్ గా కూడా కోహ్లీ పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి కోహ్లీని ఆరాధించని అభిమాని ఉండడు అనే చెప్పాలి. అయితే నిన్న మ్యాచ్ అనంతరం ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అంటే పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ కోహ్లీ దగ్గరికి వెళ్లి ఆయన సైన్ చేసిన జెర్సీని తనకు గిఫ్ట్ గా ఇవ్వమని అడిగాడు.

దాంతో కోహ్లీ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తను వేసుకున్న జెర్సీని తీసి దాని మీద సైన్ చేసి బాబర్ అజమ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు.నిజానికి బాబర్ అజమ్ కోహ్లీకి వీరాభిమాని కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ చూస్తూనే బాబర్ అజమ్ చాలా మేలుకువలు నేర్చుకున్నాను అని, ఆయన బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఆయనని ఎక్కువగా అనుకరిస్తూ ఉంటానని ఇప్పటికి చాలాసార్లు ఆయన చెప్పడం జరిగింది. ఒక పాకిస్తాన్ ప్లేయర్ అలాగే పాకిస్తాన్ టీం కెప్టెన్ అయిన బాబర్ అజమ్ దానికి తోడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న బాబర్ అజమ్ కూడా మన ఇండియన్ క్రికెటర్ అయిన కోహ్లీ ని అంతలా అభిమానిస్తున్నాడు అంటే నిజంగా కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో మనం అర్థం చేసుకోవాలి.ఇప్పటికే కోహ్లీ కొన్ని వేల పరుగుల రన్స్ చేస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి కూడా తను ఫేవరెట్ ప్లేయర్ గా నిలిచాడు అంటే కోహ్లీ గురించి ఈ విషయంలో మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఇక ఇలాంటి క్రమంలో కోహ్లీ ప్లేయర్లకి జెర్సీ ఇవ్వడం అనేది కొత్తగా వచ్చింది కాదు ఇంతకుముందు హరీస్ రావుస్ కి తన జెర్సీని సైన్ చేసి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ అజమ్ కి కూడా కోహ్లీ తన జర్సి ని గిఫ్ట్ గా ఇవ్వడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక దీంతోపాటుగా నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ అయిన వసీం అక్రమ్ కూడా కోహ్లీని కలిసి హగ్ చేసుకోవడం జరిగింది. ఇక బాబర్ అజమ్ కి కోహ్లీ తన జెర్సీ గిఫ్ట్ గా ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Oktelugu Epaper