spot_img
Homeక్రీడలుక్రికెట్‌Kavya Maran: ఏందా బౌలింగ్ వెంకీ గారు.. కావ్య మారన్ ఎక్స్ ప్రెషన్ వీడియో వైరల్

Kavya Maran: ఏందా బౌలింగ్ వెంకీ గారు.. కావ్య మారన్ ఎక్స్ ప్రెషన్ వీడియో వైరల్

Kavya Maran: హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మైదానంలో సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుత ఐపీఎల్ లో కావ్య జట్టు ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది. బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ.. టాప్ 2 స్థానంలోకి వెళ్లలేకపోయింది. నెట్ రన్ రేట్ అధికంగా సాధించడానికి బెంగళూరు జట్టును 150 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. హైదరాబాద్ జట్టుకు అది సాధ్యం కాలేదు. కాకపోతే ఈ మ్యాచ్లో ఘనమైన విజయాన్ని అందుకుంది.

బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో.. ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డికి క్రునాల్ పాండ్యా అత్యంత వేగవంతమైన బంతి వేశాడు. పైగా ఆ బంతిని కూడా బౌన్సర్ గా వేశాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఏ విధంగా అయితే వేస్తాడో.. అంతకుమించిన వేగంతో వేశాడు. అయితే ఆ బంతి వైడ్ వెళ్ళింది. దీంతో మ్యాచ్ చూస్తున్న కావ్య ఒకసారిగా ఆశ్చర్యపోయింది. తన పక్కనే ఉన్న విక్టరీ వెంకటేష్ తో సంభాషించింది.

దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. కావ్య తన జట్టు ఆటగాళ్లు ఎదుర్కొనే బంతులను కూడా అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తారని.. తన పక్కనున్న వారితో ఆ బంతుల గురించి చర్చిస్తారని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కాగా కావ్య అ బంతి గురించి వెంకటేష్ తో చర్చించారని.. బంతి అలా వేశాడు ఎందుకని ప్రశ్నిస్తే.. ఇలాంటివన్నీ జరిగిపోతూనే ఉంటాయని వెంకటేష్ బదులు ఇచ్చినట్టు అక్కడి దృశ్యాలను చూస్తే తెలుస్తోంది.

హీరో వెంకటేష్ క్రికెట్ విపరీతంగా చూస్తుంటారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్లకు కచ్చితంగా హాజరవుతారు. ప్రస్తుత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో ఆడుతున్న ప్రతి మ్యాచ్ కు వెంకటేష్ హాజరవుతున్నారు. పైగా ఆయన హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. క్రికెట్ మీద ఉన్న అభిమానంతో వెంకటేష్ తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ తీసుకుంటారని ప్రచారంలో ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper