Homeక్రీడలుక్రికెట్‌Kane Williamson Retirement: కేన్ విలియంసన్ మామ.. ఇలా చేస్తావని అనుకోలేదు.. మనసంతా భారంగా ఉంది..

Kane Williamson Retirement: కేన్ విలియంసన్ మామ.. ఇలా చేస్తావని అనుకోలేదు.. మనసంతా భారంగా ఉంది..

Kane Williamson Retirement: మనం క్రికెట్ ను ప్రేమిస్తాం. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తాం. క్రికెట్ ఆడే ప్లేయర్లను ఆరాధిస్తాం. వాళ్ళు ఏ దేశమైనా సరే.. మనవాళ్లు అనుకొని పొంగిపోతాం. మన గుండెల్లో స్థానం కల్పిస్తాం. అవసరమైతే గుండెల్లో గుడి కూడా కట్టేస్తుంటాం. ఇప్పుడు వరకు భారతీయులు ఎంతోమంది క్రికెటర్లను అభిమానించారు. ఆరాధించారు. ప్రేమించారు. ఈ జాబితాలో కేన్ విలియమ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే అతడు న్యూజిలాండ్ ఆటగాడిగా.. ఐపీఎల్ లో సన్రైజర్స్ ప్లేయర్ గా […]

Kane Williamson Retirement: మనం క్రికెట్ ను ప్రేమిస్తాం. క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తాం. క్రికెట్ ఆడే ప్లేయర్లను ఆరాధిస్తాం. వాళ్ళు ఏ దేశమైనా సరే.. మనవాళ్లు అనుకొని పొంగిపోతాం. మన గుండెల్లో స్థానం కల్పిస్తాం. అవసరమైతే గుండెల్లో గుడి కూడా కట్టేస్తుంటాం. ఇప్పుడు వరకు భారతీయులు ఎంతోమంది క్రికెటర్లను అభిమానించారు. ఆరాధించారు. ప్రేమించారు. ఈ జాబితాలో కేన్ విలియమ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే అతడు న్యూజిలాండ్ ఆటగాడిగా.. ఐపీఎల్ లో సన్రైజర్స్ ప్లేయర్ గా మనకు సుపరిచితుడు.

జెంటిల్మెన్ క్రికెట్లో జెంటిల్మెన్ మాదిరిగా అతడు ఆడుతుంటాడు. లక్షల మంది అభిమానిస్తుంటారు. చివరికి అతడిని మనం కేన్ మామ అని పిలుచుకుంటున్నామంటే అతడు మన మీద ఏ స్థాయిలో ముద్ర వేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. మైదానంలో చలాకీగా ఉంటాడు. మ్యాచ్ ఓడిపోయినా.. గెలిచినా సరే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఓడిపోయినప్పుడు బాధపడడు. గెలిచినప్పుడు విర్రవీగడు. అతడి మెరుగైన వ్యక్తిత్వం ఎంతమంది అభిమానులను సాధించిపెట్టింది..

విలియమ్స్ పేరుతో అభిమానులు సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. పైగా అతడు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. ఇండియాలోనే విలియమ్సన్ కు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీన్నిబట్టి అతడిని మనవాళ్లు ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ క్రికెట్ మీద తనదైన ముద్ర వేసిన కేన్ విలియంసన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అతడు 110 టెస్ట్ లు ఆడాడు. ఇందులో 33 శతకాలు ఉన్నాయి. 9515 రన్స్ చేశాడు. ఇందులో 175 వన్డేలలో 15 సెంచరీలు చేశాడు. 7256 రన్స్ చేశాడు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు.

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు 2015 నుంచి 2022 వరకు ప్రాతినిధ్యం వహించాడు. కొన్నిసార్లు ఆ జట్టుకు నాయకుడిగా కూడా వ్యవహరించాడు. హైదరాబాద్ జట్టుతో ఉన్న ప్రత్యేకమైన అభిమానం వల్ల అతడిని చాలామంది కేన్ మామ అని పిలుస్తుంటారు. అతడు కూడా ఆ పిలుపును ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటాడు. అనేక సందర్భాలలో హైదరాబాద్ అభిమానుల మీద తన ప్రేమను వ్యక్తం చేశాడు.”మీ బిర్యాని తిన్నాను. మీ హలీం రుచికి చూశాను. మీ ప్రేమకు ఫిదా అయ్యాను” అంటూ అప్పట్లో కేన్ మాట్లాడిన మాటలు హైదరాబాద్ అభిమానులకు సరికొత్త ఉత్తేజాన్నిచ్చాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper