Homeఎంటర్టైన్మెంట్Pandu Master Health Update: పండు మాస్టర్ ఇక జీవితం లో డ్యాన్స్ చెయ్యలేడా ..?...

Pandu Master Health Update: పండు మాస్టర్ ఇక జీవితం లో డ్యాన్స్ చెయ్యలేడా ..? డాక్టర్లు ఏమి చెపుతున్నారంటే..

Pandu Master Health Update: ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘ఢీ’ అనే రియాలిటీ షో ద్వారా , స్టార్ సెలబ్రిటీ అనే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంటెస్టెంట్ పండు మాస్టర్. కేవలం డ్యాన్స్ మాత్రం కాదు , తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించడం పండు మాస్టర్ స్పెషాలిటీ. అందుకే దాదాపుగా ఆయన ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షోలో ఉంటాడు. ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న […]

Pandu Master Health Update: ఈటీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘ఢీ’ అనే రియాలిటీ షో ద్వారా , స్టార్ సెలబ్రిటీ అనే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంటెస్టెంట్ పండు మాస్టర్. కేవలం డ్యాన్స్ మాత్రం కాదు , తన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించడం పండు మాస్టర్ స్పెషాలిటీ. అందుకే దాదాపుగా ఆయన ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షోలో ఉంటాడు. ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న ‘ఢీ 20’ డ్యాన్స్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. ‘ఈ సాలా కప్ నామ్ దే’ అంటూ సందడి చేస్తూ కనిపించే పండు మాస్టర్ కి అకస్మాత్తుగా రీసెంట్ గానే యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరం. ప్రస్తుతం పండు మాస్టర్ హాస్పిటల్ లోనే శస్త్ర చికిత్స చేయించుకుంటున్నాడు. కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయంలో , సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలు అవ్వడం ఆయన అభిమానులను తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురి చేస్తోంది.

డ్యాన్సర్ కి ఎంతో ముఖ్యమైన కాళ్ళు పనికిరాకుండా పోతే , ఇక వాళ్ళు జీవితం లో అన్ని లక్ష్యాలు కోల్పోయినట్టే. పైగా పండు మాస్టర్ కి ‘బిగ్ బాస్ 10’ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ కూడా వచ్చిందట. ఈ షో తో వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు అని అనుకుంటున్న సమయంలో , ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. అయితే కొంతమంది సోషల్ మీడియా లో పండు మాస్టర్ ఇక జీవితం లో డ్యాన్స్ చేయలేడని , ఇక మీదట ఆయన్ని బుల్లితెర పై చూడలేమని , ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది, పండు మాస్టర్ కి అవసరమయ్యే సర్జరీ పూర్తి అయ్యిందని , కేవలం మూడు నెలల్లోనే ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటాడని , కాలం కలిసొస్తే ఆయన ‘బిగ్ బాస్ 10’ లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper