IPL trophy 2025
IPL trophy 2025 : మార్చి 23న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ పై హైదరాబాద్ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ఎందుకంటే సొంత మైదానంలో హైదరాబాద్ జట్టుకు తిరుగులేదు. పైగా ఈ మైదానంపై హైదరాబాద్ జట్టు భారీగా పరుగులు చేసింది. ప్లాట్ మైదానం కావడం.. సొంత ప్రేక్షకుల మద్దతు ఉండడంతో హైదరాబాద్ జట్టు ఈసారి కూడా ఫేవరెట్ గా రంగంలోకి దిగుతోంది. మరోవైపు రాజస్థాన్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. సంజు శాంసన్ నాయకత్వంలో ఆ జట్టులో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అందువల్ల ఈ రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. మార్చి 23 మ్యాచ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో హైదరాబాద్ అభిమానులు రెచ్చిపోతున్నారు. తమ జట్టు మీద ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒక వీడియో మాత్రం తెగ చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..
Also Read : ఐపీఎల్ రూల్స్ మారుతున్నాయి.. బౌలర్లకు వికెట్ల పండగే
సంబంధం కలిపేశారు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గతంలో దక్కన్ చార్జర్స్ గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దక్కన్ చార్జర్స్ జట్టు ఏర్పడింది. నాడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉండేది కాబట్టి.. దక్కన్ చార్జర్స్ జట్టు ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాదులోనే ఉండేది. ఇక 2013లో దక్కన్ చార్జర్స్ కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారిపోయింది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. దానికి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. ఆ ప్రాతిపదికగానే దక్కన్ చార్జర్స్ జట్టుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అని పేరు పెట్టారు. హైదరాబాద్ జట్టును సన్ గ్రూప్ యాజమాన్యం కొనుగోలు చేసింది కాబట్టి.. తన జట్టులో తన కంపెనీ పేరు ఉండే విధంగా సన్ గ్రూప్ యాజమాన్యం చూసుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అది ముంబై, చెన్నై, బెంగళూరు జట్ల తరహాలోనే ఉంటుంది. అయితే ఈసారి 18 ఎడిషన్లో హైదరాబాద్ జట్టుకు అభిమానులు సరికొత్త బూస్టర్ ఇచ్చేలాగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న వివిధ ప్రాంతాల పేర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఆపాదిస్తున్నారు.. కూకట్పల్లి అంటే క్లాసెన్, శంషాబాద్ అంటే షమీ, అమీర్పేట అంటే అభిషేక్, ఉప్పల్ అంటే ఉనద్కత్ అని.. హైటెక్ సిటీ అంటే హెడ్ అని.. పంజాగుట్ట అంటే పాట్ కమిన్స్ అని.. ఖైరతాబాద్ అంటే కిషన్ అని.. జూ పార్క్ అంటే జంపా అని.. నాగోల్ అంటే నితీష్ అని.. హఫీజ్ పేట అంటే హర్షల్ అని.. చార్మినార్ అంటే చాహర్ అని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా ఒక వీడియోను కూడా రూపొందించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
Also Read : ఈసారి అయినా గెలిపించు దేవా.. పంజాబ్ కింగ్స్ హోమం వైరల్